శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హెడ్‌ సెంచరీ

14 గంటల క్రితం

head
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 12:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- రెండో వన్డేలో జింబాబ్వేపై ఆసీస్‌ గెలుపు

హరారే: జింబాబ్వే పర్యటనలో ఆస్ర్టేలియా జట్టు అదరగొడుతోంది. తొలి వన్డేలో 59పరుగుల తేడాతో నెగ్గిన ఆసీస్‌.. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను ఓపెనర్లు హెడ్‌(112) సెంచరీకి తోడు కెప్టెన్‌ మార్ష్‌(53) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఛేదనలో జింబాబ్వే 48.3ఓవర్లలో 272పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ సికిందర్‌ రాజా(45)కి టేలర్‌(39) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఆసీస్‌ బౌలర్లు హేజిల్‌వుడ్‌, కనోలే, రెన్‌షా, జంపాకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హెడ్‌కు లభించగా.. మూడో, చివరి వన్డే ఆదివారం జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్