ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపు
హాంకాంగ్: హాంకాంగ్ సిక్సెస్-2026 టైటిల్‌ను ఆఫ్ఘనిస్థాన్ జట్టు చేజిక్కించుకొని కొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఆరు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. బ్రయంట్(44), అలెక్స్ రాస్(29) పరుగులతో రాణించారు. ఛేదనలో ఆఫ్ఘనిస్థాన్‌కు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా.. ఇమ్రాన్ మీర్(53), ఫర్మానుల్లా సఫీ(26), కెప్టెన్ గుల్బదిన్ నయీబ్(17) బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ 5.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక గ్రూప్-సిలో ఉన్న భారతజట్టు పాకిస్థాన్, యుఎఇ చేతిలో, ఆ తర్వాత బౌల్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలోనూ పరాజయం పాలైంది. 11వ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో బంగ్లా నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు చేతిలో ఉండగానే ఛేదించింది. దీంతో భారత్ 11వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ 12వ స్థానంతో టోర్నీని ముగించింది.








కామెంట్‌లు (0)