బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionICC ODI Rankings: టాప్‌ ‌ర్యాంక్‌‌కు చేరువలో శుభ్‌‌మన్‌

1 గంట క్రితం

gill and bumrha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 10:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‌దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ ‌మండలి(ఐసిసి) తాజా వన్డే ర్యాంకింగ్స్‌‌లో టీమిండియా కెప్టెన్‌ ‌శుభ్‌‌మన్‌ ‌గిల్‌ ‌టాప్‌ ‌ర్యాంక్‌‌కు చేరువయ్యాడు. ఇంగ్లండ్‌‌తో జరిగిన తొలి వన్డేలో 80 పరుగులతో రాణించిన గిల్‌.. 12 రేటింగ్ పాయింట్లు చేరికతో 803పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో ప్రపంచ నంబర్ 1 ఆటగాడు, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్(814) అగ్రస్థానానికి అడుగు దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఈ జాబితాలో అతడి కంటే గిల్ కేవలం 11 పాయింట్ల తేడాతో మాత్రమే వెనుకబడి ఉన్నాడు. టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మూడు, నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నారు.

బుమ్రా ర్యాంక్ మెరుగుదల

దాదాపు 968 రోజుల తర్వాత వన్డేల్లోకి ఆడిన జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌‌పై తొలి మ్యాచ్‌లో రాణించాడు. తాజా ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 24వ స్థానానికి చేరుకున్నాడు. తొలి వన్డేలో నాలుగు వికెట్లు తీసి, అజేయ అర్ధ శతకంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’‌గా నిలిచిన అక్షర్ పటేల్‌కు కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అతడు ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 73వ స్థానంలో, బౌలింగ్‌లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 42వ స్థానంలో నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-10లో 9వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్‌లో 24 స్థానాలు ఎగబాకి 177వ స్థానానికి చేరుకోగా.. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో 16 స్థానాలు మెరుగుపరుచుకుని 55వ ర్యాంక్‌లో నిలిచాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్