టి20ల్లో వైభవ్‌కు 48వ ర్యాంక్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో అగ్రస్థానంలో నిలువగా.. టి20 ర్యాంకింగ్స్‌లో 15ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిలిచాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన గిల్(801).. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్(794)ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మూడు, నాలుగు స్థానాల్లో విరాట్ కోహ్లీ(767), రోహిత్ శర్మ(758) కొనసాగుతున్నారు. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో అదరగొట్టాడు. జింబాబ్వేపై వరుసగా రెండు అర్ధ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన వైభవ్.. టి20 ర్యాంకింగ్స్ జాబితాలో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సిరీస్‌లో 151 పరుగులు చేసిన వైభవ్.. 278వ స్థానం నుంచి నేరుగా 48వ స్థానానికి దూసుకొచ్చాడు. టీ20 బ్యాటర్ల జాబితాలో ఇషాన్ కిషన్ 910 రేటింగ్ పాయింట్లతో నంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకోగా, పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ రెండో స్థానానికి ఎగబాకాడు. అభిషేక్ శర్మ మూడో స్థానానికి పడిపోగా.. తిలక్ వర్మ(750) ఆరో స్థానానికి చేరుకున్నాడు. వన్డే బౌలింగ్ జాబితాలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్ 15 జాబితాలో భారత బౌలర్లలో కేవలం కుల్‌దీప్ యాదవ్ చోటు దక్కించుకోవడం గమనార్హం. 596 పాయింట్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు.








కామెంట్‌లు (0)