సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెస్టిండీస్‌ ఆటగాళ్లపై చర్యలు: ఐసిసి

1 గంట క్రితం

wi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 12:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

దుబాయ్‌: రెండో టి20లో టీమిండియాపై భారీ లక్ష్యం ఛేదించిన వెస్టిండీస్‌కు షాక్‌ తగిలింది. ఆ జట్టు ప్లేయర్లు రోవ్‌మన్‌ పావెల్‌, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌పై ఐసిసి చర్యలకు ఉపక్రమించింది. ఆ టి20లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ వీరిద్దరికీ చెరో డీమెరిట్‌ పాయింట్‌ కేటాయించింది. రెండో టీ20లో పావెల్‌ మయాంక్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో అతడు బ్యాట్‌తో బంతిని కొట్టి దూరంగా పంపించాడు. ఈ చర్యను ఐసిసి నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి చర్యలు తీసుకుంది. ఇక వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో బంతిని వైడ్‌గా ప్రకటించకపోవడంతో రూథర్‌ఫోర్డ్‌ అంపైర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దీన్ని నిబంధన ఉల్లంఘనగా పరిగణించిన ఐసీసీ చర్యలు తీసుకుంది. ఫీల్డ్‌ అంపైర్లు జయరామన్‌ మదనగోపాల్‌, రోహన్‌ పండిట్‌, థర్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌, ఫోర్త్‌ అంపైర్‌ వీరేందర్‌ శర్మ పావెల్‌, రూథర్‌ఫోర్డ్‌పై అభియోగాలు మోపారు. వారిద్దరు తమ తప్పులను అంగీకరించి, ఐసిసి విధించిన శిక్షలను ఒప్పుకున్నట్లు ఐసిసి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్