మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionINDA vs AUSA: ఇండియా-ఎ 257/5

4 గంటల క్రితం

India A vs Australia A, 1st unofficial Test, Australia A tour of India 2026
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 10:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పుదుచ్చేరి: ఆస్ర్టేలియా-ఎతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌ల భారత బ్యాటర్లు రాణించారు. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌, కుషగ్ర, తనుష్‌ కోటియన్‌ అర్ధసెంచరీలో రాణించడంతో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్‌-ఎ 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్క లేదు. మార్కండే(6), కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌(3)కి తోడు రషీద్‌(16), యశ్‌ రాథోడ్‌ నిరాశపరిచారు. దీంతో భారత్‌ 97 పరుగులకే 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో సుదర్శన్‌(57), కుషగ్ర(82రిటైర్డ్‌), తనుష్‌ కోటియన్‌(68నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించారు. క్రీజ్‌లో తనుష్‌కి తోడు సామ్స్‌ ములానీ ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్