ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్‌-ఎ ఘన విజయం

2 గంటల క్రితం

tetch
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 11:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- శ్రీలంక-ఎతో రెండో అనధికార టెస్ట్‌

గాలె: శ్రీలంక-ఎతో జరిగిన రెండో అనధికార టెస్టులో భారత్‌-ఎ10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇండియా ఎ 1-0తో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 541/8 స్కోరుతో ఆదివారం, చివరి రోజు ఆటను కొనసాగించిన ఇండియా ఎ మరో రెండు పరుగులకే తొమ్మిదో వికెట్ కోల్పోయింది.రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగిన రుతురాజ్ గైక్వాడ్ (13)తిరిగి బ్యాటింగ్‌కు రాకపోవడంతో భారత్ ఇన్నింగ్స్ అక్కడితో ముగిసింది.

రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక-ఎ209 పరుగులకే ఆలౌటైంది. అషేన్ బండార (87) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో గూర్నూర్‌ బ్రార్ ఆరు వికెట్లు పడగొట్టగా..సారాంశ్ జైన్ 2, ఆకిబ్ నబీ దార్, యశ్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.శ్రీలంక నిర్దేశించిన 33 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్6.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది.సాయి సుదర్శన్‌ (25*), అమన్‌ మోఖడే (11*) రన్స్‌చేశారు.తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక-ఎ366 పరుగులకు ఆలౌటైంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

సంక్షిప్త స్కోరు వివరాలు :

శ్రీలంక-ఏ తొలి ఇన్నింగ్స్‌ : 366/10 (సహాన్‌ 127, ఫెర్నాండో 44, గుర్నూర్‌ బ్రార్‌ 4/77, సరాన్షు జైన్‌ 4/46)

భారత్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌ : 543/10 (సాయి సుదర్శన్‌ 168, పడిక్కల్‌ 94, సరాన్షు 70, జురెల్‌ 54, నువాంత 5/159)

శ్రీలంక-ఏ రెండో ఇన్నింగ్స్‌ : 209/10 (ఆషెన్‌ 87, నువాంత 26, గుర్నూర్‌ బ్రార్‌ 6/68, సరాన్షు 2/66)

భారత్‌-ఏ రెండో ఇన్నింగ్స్‌ : 36/0 (సాయి సుదర్శన్‌ 25 నాటౌట్‌, ఆమన్‌ 11 నాటౌట్‌)


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్