శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Asian Games: పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం.. స్వర్ణం సొంతం

16 గంటల క్రితం

team india.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 11:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆసియా క్రీడలు-2026 పురుషుల క్రికెట్‌ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్‌ అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో టీమ్‌ఇండియా 19 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్‌ ముందు 212 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌ భారత బౌలర్ల ధాటికి 192 పరుగులకే పరిమితమైంది. పాకిస్థాన్‌ బ్యాటర్‌ హసన్‌ నవాజ్‌ 96 పరుగులతో చివరి వరకు పోరాడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి పాక్‌ విజయాన్ని అడ్డుకున్నారు. ఈ విజయంతో ఆసియా క్రీడలు-2026లో పురుషుల క్రికెట్‌ స్వర్ణ పతకం భారత్‌ సొంతమైంది.

తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తిలక్‌ వర్మ 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అదరగొట్టాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసిన తిలక్‌.. మొత్తం 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. అంతకుముందు ఓపెనర్ అభిషేక్‌ శర్మ 61 పరుగులతో చెలరేగాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. సంజు శాంసన్‌ 21, ఇషాన్‌ కిషన్‌ 20, శివమ్‌ దూబే 27 పరుగులు చేశారు. చివరి ఐదు ఓవర్లలో భారత్‌ ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 74 పరుగులు రాబట్టింది. పాక్‌ బౌలర్లలో అహ్మద్‌ దనియల్‌, అరాఫత్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. సైమ్‌, అబ్రార్‌కు చెరో వికెట్‌ దక్కింది. దీంతో పాకిస్థాన్‌ విజయానికి 212 పరుగులు చేయాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్