గోవాలో వేలం.. ఉదయం 11 గంటలకు ప్రారంభం
ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి మినీ వేలం తేదీ, సమయం, వేదికను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. డిసెంబర్ 16న గోవాలో వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బుధవారం వెల్లడించింది. వేలం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. 2023 తర్వాత ఐపీఎల్ వేలం భారత్‌లో జరగనుండటం విశేషం.
సాధారణంగా మధ్యాహ్నం ప్రారంభమయ్యే వేలాన్ని ఈసారి ఉదయం 11 గంటలకే నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందే వేలం జరిగేలా సమయాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఐపీఎల్ 2027కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. దీంతో మినీ వేలంలో ఏయే ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.








కామెంట్‌లు (0)