మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionJPN vs IND: ఏకైక టి20లో చెమటోడ్చి నెగ్గిన భారత్‌

5 గంటల క్రితం

japan vs india.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 10:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలుపు

టోక్యో: భారత్‌-జపాన్‌ జట్ల మధ్య సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఏకైక టి20లో టీమిండియా గెలిచి ఊపిరి పీల్చుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో జపాన్‌పై రెండు పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. వర్షం కారణంగా కేవలం 5ఓవర్లు మాత్రమే సాగిన ఈ మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్‌ శర్మ గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. సంజూ శాంసన్‌(9), ఇషాన్‌ కిషన్‌(3), తిలక్‌ వర్మ(1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే ఔటయ్యారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(16) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఛేదనలో జపాన్‌ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 3వికెట్ల నష్టానికి 30పరుగులు చేసింది. చివ‌రి ఓవ‌ర్‌లో విజ‌యానికి 8 ప‌రుగులు కావల్సిన దశలు అక్ష‌ర్ ప‌టేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవ‌లం 5 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. అక్షర్‌ పటేల్‌ తన రెండు ఓవర్ల కోటాలో వికెట్లు తీయకున్నా.. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వాషింగ్టన్‌ సుందర్‌ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. జపాన్‌ బౌలర్లలో కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్(12) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్