శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Asian Games: శ్రీచరణి స్పిన్‌ మాయ.. సెమీస్‌‌లోకి భారత్‌

6 గంటల క్రితం

cricket.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 08:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జపాన్‌పై భారత్‌ 8 వికెట్ల విజయం

జపాన్‌ : జపాన్‌: శ్రీచరణి స్పిన్‌ మాయాజాలానికి షెఫాలీ వర్మ ధనాధన్‌ బ్యాటింగ్‌ తోడవడంతో ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మెరుగైన ర్యాంకింగ్‌తో నేరుగా క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన.. ఆతిథ్య జపాన్‌ను చిత్తుగా ఓడించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో తొలుత జపాన్‌ను 57 పరుగులకే కట్టడి చేసిన భారత్‌.. అనంతరం 5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన జపాన్‌ భారత బౌలర్ల ధాటికి 19.5 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. తెలుగు తేజం శ్రీచరణి అద్భుతంగా బౌలింగ్‌ చేసి 4 వికెట్లు పడగొట్టి జపాన్‌ పతనంలో కీలక పాత్ర పోషించింది. షెఫాలీ వర్మ 2 వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్‌ చెరో వికెట్‌ సాధించారు.

జపాన్‌ బ్యాటర్లలో ఓపెనర్లు అయాక (25), హరుణ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లు మై యనగిడా(0),ఎరికా ఓడా(5), షిమాకో కటో(3), అకారి నిషిముర కానో (2), హినాసే గోటో (1), అహిల్య చందేల్(0), అయుమి ఫుజికావా (4), ఎరికా తోగుచి క్విన్(0), నోనోహా యసుమోటో(0) పూర్తిగా విఫలమయ్యారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఓపెనర్‌ షెఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్ని అందించింది. కేవలం 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. కమిలిని డకౌట్‌ కాగా, భార్తి 6 పరుగులు చేసింది. రిచా ఘోష్‌ 6 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో భారత్‌ కేవలం 5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్