చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-2027 ప్రారంభానికి ముందు చెన్నై ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. మోహిత్ శర్మను కొత్త బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించింది. 38ఏళ్ల మోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 4సీజన్‌లు ఆడాడు. ఎరిక్ సీమన్స్ స్థానంలో మోహిత్ శర్మ బౌలింగ్ బాధ్యతలను అందుకోనున్నాడు. ఇటీవల చెన్నై ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో జహీర్ ఖాన్ సహాయ సిబ్బంది ఎంపిక ప్రక్రియ ప్రారంభంలో భాగంగా బౌలింగ్ కోచ్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని సిఎస్‌కే సిఇవో కాశీ విశ్వనాథన్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
Print Editionచెన్నై సూపర్‌కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా మోహిత్ శర్మ
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 10:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)