ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionNZ vs IND, 5th T20I: గెలుపుతో ముగించాలి

14 గంటల క్రితం

NZ.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 01:41 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నేడు న్యూజిలాండ్‌ ఐదో, చివరి టి20

  • మధ్యాహ్నం 12.30గం.ల నుంచి

హామిల్టన్‌: భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య హామిల్టన్ వేదికగా ఐదో, చివరి టి20 జరగనుంది. నాలుగో టి20లో 87 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసిన టీమిండియా.. ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌ను గెలుపుతో ముగించాలని చూస్తోంది. నాల్గో టి20 ముగిసిన అనంతరం ఈడెన్‌ పార్క్‌ నుంచి సెడాన్‌ పార్క్‌కు ఒక్కరోజు వ్యవధిలోనే విచ్చేయడంతో, ఆటగాళ్లు కనీసం ప్రాక్టీస్‌ చేసుకొనేందుకు కూడా అవకాశం లభించలేదు. ఈ సిరీస్‌ ముగిసిన అనంతరం టి20 ఆటగాళ్లంతా స్వదేశానికి బయల్దేరి వెళ్లనుండగా.. వన్డే సిరీస్‌లో ఆడేందుకు కోహ్లి, రోహిత్‌, జడేజాతోపాటు జట్టు బృందమంతా విచ్చేసింది. మరోవైపు టెస్ట్‌లకు సన్నద్ధత అయ్యేందుకు న్యూజిలాండ్‌-ఎతో మరో జట్టు ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. తొలుత టి20 సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. అనూహ్యంగా 4వ టి20లో ఓటమితో హామిల్టన్‌లో ప్రత్యర్ధిని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే ఇప్పటికే సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకున్నా.. ఆఖరి మ్యాచ్‌లో కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. నాలుగో టి20లో బెంచ్‌కే పరిమితమైన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఓపెనర్ సంజూ శాంసన్‌ను విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో వైభవ్‌కు అవకాశమివ్వనున్నట్లు తెలిసింది. రెండో టి20కు ఇషాన్ కిషన్ స్ధానంలో తుది జట్టులోకి వచ్చిన వైభవ్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కానీ మూడో టి20లో మాత్రం 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు రీఎంట్రీలో భువనేశ్వర్ కుమార్ విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన భువీ కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీంతో నాలుగో టి20కు అతడిని పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే ఛాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన భువనేశ్వర్‌కు చివరి అవకాశమివ్వాలని టీమిం డియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమా చారం. అదే జరిగితే ప్రిన్స్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అలాగే అక్షర్ పటేల్ స్థానంలో శివం దూబే తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.

వన్డే జట్టులో అబ్దుల్‌ నబికి చోటు...

న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో జమ్మూ కశ్మీర్ సంచలనం ఆకిబ్ నబీకి బిసిసిఐ అవకాశం కల్పించింది. తొలుత చివరి రెండు వన్డేల కోసం మాత్రమే ఎంపికైన నబీ.. తాజా పరిణామాలతో తొలి మూడు వన్డే మ్యాచ్‌ల్లో కూడా ఆడనున్నాడు. కాగా ఈ సిరీస్‌లో భారత్ రెండు వేర్వేరు జట్లతో బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌తో గౌహతిలో జరిగిన రెండో వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ గాయపడ్డాడు. అయితే ఫిట్‌నెస్‌కు లోబడి భారత వన్డే జట్టులో ప్రసిద్ధ్‌కు చోటు కల్పించారు. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు అతడిని దూరంగా ఉంచాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీకి అంతర్జాతీయ స్థాయిలో పరిమిత అనుభవమే ఉంది. మహ్మద్ సిరాజ్ మాత్రమే 50కి పైగా వన్డేలు ఆడిన ప్రధాన పేసర్‌గా జట్టులో ఉన్నాడు. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించడంతో మహ్మద్‌ సిరాజ్‌పై మరింత భారం పడనుంది.


జట్లు(అంచ‌నా)...

ఇండియా: శ్రేయాస్(కెప్టెన్‌), అభిషేక్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిష‌న్‌(వికెట్ కీప‌ర్‌) తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, మయాంక్ యాదవ్, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, ఆర్స్‌దీప్‌

​

న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెప్టెన్‌), షెఫర్ట్‌(వికెట్‌ కీపర్‌), ఫిన్‌ అలెన్‌, మిఛెల్‌, ఫిలిప్స్‌, జాకోబ్స్‌, బ్రాస్‌వెల్‌, స్మిత్‌, మిల్నే, డఫీ, ఫిషెర్‌.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్