డ్రా దిశగా పాకిస్తాన్‌తో తొలి టెస్ట్
రావల్పిండి: పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ డ్రా దిశగా పయనిస్తోంది. నిర్ణయాత్మక నాల్గోరోజు ఆటకు వర్షం అడ్డంకిగా నిలవడంతో శ్రీలంక జట్టు కేవలం 42 పరుగులకే 6వికెట్లు కోల్పోయింది. దీంతో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లఓ 446 పరుగులకు ఆలౌటైంది. ధనుంజయ(167), కుశాల్ మెండీస్(119)కి తోడు సొనాల్(20) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మిలాన్(12), లాహిరు(0), ఫెర్నాండో(4) నిరాశపరిచారు. పాకిస్తాన్ బౌలర్లు సాఖీబ్ ఖాన్‌కు ఏడు, అబ్బాస్‌కు రెండు వికెట్లు దక్కాయి. దీంతో శ్రీలంక జట్టుకు కేవలం 12పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత మాత్రమే లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు నాల్గోరోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 57పరుగులు చేసింది. అజాన్(22), మహ్మద్(24) క్రీజ్‌లో ఉండగా.. తయ్యబ్(11) అసితా ఫెర్నాండో బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. శుక్రవారం ఆటకు చివరి రోజు కావడంతో తొలి మ్యాచ్ డ్రా కావడం ఖాయం.







కామెంట్‌లు (0)