శ్రీలంకతో రెండో టెస్ట్
రావల్పిండి: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు గెలుపుకు చేరువైంది. నాల్గోరోజు ఆట ముగిసేసరికి శ్రీలంకను రెండో ఇన్నింగ్స్ 9 వికెట్ల నష్టానికి 309 పరుగులకే పరిమితం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లఓ 98 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటింది. కుశాల్ మెండీస్(53), సొనాల్ దినుషా(54), రత్నాయకే(60నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో శ్రీలంక జట్టుకు ఇప్పటికి కేవలం 82 పరుగుల ఆధిక్యత మాత్రమే లభించింది. పాకిస్తాన్ బౌలర్లు అమీర్ జమాల్‌కు మూడు, అబ్బాస్, రజుల్లాకు రెండేసి, షకీబ్ ఖాన్, సల్మాన్ అఘాకు ఒక్కో వికెట్ దర్కాయి. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్ డ్రా కాగా.. రెండో టెస్ట్‌లో గెలిచిన జట్టుకు సిరీస్ దక్కనుంది.








కామెంట్‌లు (0)