హైదరాబాద్‌ను గెలిపించిన అనికేత్, రక్షణ్
ఛండీగడ్: ఆంధ్ర, పంజాబ్ జట్ల మధ్య జరిగిన రంజీట్రోఫీ మ్యాచ్ డ్రా అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 292 పరుగులతో చివరిరోజు ఆటను కొనసాగించిన ఆంధ్ర జట్టు చివరిరోజు ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 505 పరుగులు చేసింది. రషీద్(176) భారీ శతకానికి తోడు వెంకట రాహుల్(76నాటౌట్) అర్ధసెంచరీతో రాణించాడు. త్రిపురణ విజయ్(17నాటౌట్) కూడా చివర్లో బ్యాటింగ్‌లో రాణించడంతో ఆంధ్ర జట్టు ఆలౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 592పరుగులు చేయగా.. అనంతరం ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 8 వికెట్ల నష్టానికి 505 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సంపాదించిన పంజాబ్ జట్టుకు మూడు పాయింట్లు, ఆంధ్రకు ఒక పాయింట్ లభించాయి. 17నుంచి విశాఖ పట్నం వేదికగా ఆంధ్ర-సౌరాష్ట్ర జట్ల మధ్య రంజీ మ్యాచ్ ప్రారంభం కానుంది.
హైదరాబాద్ సంచలన విజయం
జింఖానా గ్రౌండ్స్ వేదికగా ఛత్తీస్‌గడ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 13 పరుగులతో నాల్గో, చివరిరోజు ఆటను కొనసాగించిన హైదరాబాద్ జట్టు ఛత్తీస్‌గడ్ నిర్దేశించిన 259పరుగుల లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి వికెట్‌కు అనికేత్ రెడ్డి(39), రక్షన్ రెడ్డి(15) క్రీజ్‌లో నిలిచి మ్యాచ్‌ను ముగించడం విశేషం. హైదరాబాద్ జట్టు ఒక దశలో 220 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో నిలిచింది. ఆ దశలో అనికేత్, రక్షణ్ మ్యాచ్‌ను ముగించారు. హైదరాబాద్ జట్టులో అభిరథ్‌రెడ్డి(68), వరణ్ గౌడ్(55), రాహుల్ రాధేశ్(39) అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనికేత్ రెడ్డికి లభించింది. 17నుంచి గౌహతి వేదికగా హైదరాబాద్ జట్టు అస్సాంతో తలపడనుంది.








కామెంట్‌లు (0)