రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు, విదర్భ స్టార్ హర్ష్ దూబే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మధ్యప్రదేశ్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్లతో చెలరేగాడు. నాగ్‌పూర్ వేదికగా టాస్ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టు 209 పరుగులకు ఆలౌటైంది.. లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే 23.1 ఓవర్లు బౌలింగ్ చేసి 53 పరుగులిచ్చి ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. దఈంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో విదర్భ తరఫున ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు 1967లో మద్యప్రదేశ్‌పై అరుణ్ ఓగిరాల్(8(39) పేరిట ఉండేది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ నాలుగు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్ కంటే ఇంకా 153 పరుగులు వెనుకబడి ఉంది.
సలీల్, సన్వీర్ సెంచరీలు- పంజాబ్ 276/5
రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో ఆంధ్ర బౌలర్లు తేలిపోయారు. పంజాబ్‌తో సోమవారంనుంచి ప్రారంభమైన రంజీట్రోఫీలో తొలిరోజు ఆట ముగిసేసరికి పంజాబ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. సలీల్ అరోరా, సన్వీర్ సింగ్ సెంచరీతో రాణించగా.. భారత బౌలర్లు టాపార్డర్ వికెట్లను త్వరగా పెవీలియన్‌కు పంపినా.. ఆ తర్వాత నిరాశపరిచారు. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను ఆంధ్ర బౌలర్లు సాయితేజ(3/67), నరసింహ (2/39) కట్టడి చేశారు. దీంతో పంజాబ్ జట్టు ఒక దశలో 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో వికెట్ కీపర్ సలీల్ అరోరా(111), సన్వీర్ సింగ్(100) అజేయ శతకాలతో మెరిసి పంజాబ్‌ను ఆదుకున్నారు.
ఛత్తీస్‌గడ్ 279/7
జింఖానా మైదానంలో ఛత్తీస్‌గడ్‌పై హైదరాబాద్‌బౌలర్లు రాణించారు. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి ఛత్తీస్‌గడ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గడ్‌ను ఓపెనర్, కెప్టెన్ అనుజ్ తివారి(72), వికల్స్ తివారి(69) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. ఆ తర్వాత వికెట్ కీపర్ మయాంక్(36), జయంత్(36)కి తోడు ప్రేరక్ యాదవ్(27) మాత్రమే బ్యాటింగ్‌లోరాణించారు. హైదరాబాద్ బౌలర్లు రక్షణ్ రెడ్డి, అనికేత్‌కు రెండేసి, మిలింద్, త్యాగరాజన్, రుత్విక్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.








కామెంట్‌లు (0)