పంజాబ్ 592/9 డిక్లేర్డ్
ఛండీగడ్: రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్-సిలో ఆంధ్ర బౌలర్లు తేలిపోయారు. పిసిఎ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రంజీట్రోఫీలో రెండోరోజు పంజాబ్ మిడిలార్డర్ బ్యాటర్ సన్వీర్ సింగ్(205) డబుల్ సెంచరీకి తోడు ఇమాన్‌జ్యోత్ సింగ్(122) సెంచరీతోరాణించారు. లోయర్ ఆర్డర్‌లో సుఖ్‌దీప్ సింగ్(38నాటౌట్) కూడా రాణించడంతో రెండోరోజు పంజాబ్ జట్టు 9వికెట్ల నష్టానికి 592పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. ఓవర్‌నైట్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 276 పరుగులతో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పంజాబ్‌ను సన్వీర్ డబుల్ శతకంతో ఆదుకున్నాడు. వికెట్ కీపర్ సలీల్ అరోరా(144) ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన ఇమాన్‌జ్యోత్ సింగ్ కూడా శతకంతో రాణించడంతో పంజాబ్ భారీస్కోర్ చేసింది. ఆంధ్ర బౌలర్లు సాయితేజకు మూడు, నరసింహరావు, త్రిపురణ విజయ్, సౌరభ్ కుమార్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు రెండోరోజు ఆట నిలిచే సమయానికి 20 పరుగులు చేసింది.
హైదరాబాద్ 275/9
జింఖానా మైదానంలో ఛత్తీస్‌గడ్, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న రంజీమ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఛత్తీస్‌గడ్ 284 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండోరోజు ఆట నిలిచే సమయానికి హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సంపాదించాలంటే హైదరాబాద్‌కు మరో 10పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది. క్రీజ్‌లో త్యాగరాజన్(29), రక్షన్ రెడ్డి(1) ఉన్నారు. ఇక హైదరాబాద్ జట్టులో రాహుల్ రాదేశ్(72) అర్ధసెంచరికి తోడు హిమతేజ(46), అభిరథ్‌రెడ్డి(35), అంకిత్ రెడ్డి(32) బ్యాటింగ్‌లో రాణించారు. ఛత్తీస్‌గడ్ బౌలర్లు ధర్మేంద్రసింగ్‌కు ఐదు, ఆదిత్యసింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి.








కామెంట్‌లు (0)