ఈ ఘనత సాధించిన తొలి భారత లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా సరికొత్త చరిత్ర
శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 350 వికెట్లు పడగొట్టిన తొలి భారత లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించాడు. సోమవారం, మ్యాచ్ మూడో రోజు ఆటలో భాగంగా శ్రీలంక ఆల్ రౌండర్ కేశర నువంతను ఔట్ చేయడం ద్వారా జడేజా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
కాగా టెస్టుల్లో 350 వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా జడేజా నిలిచాడు. అతని కంటే ముందు దిగ్గజాలు అనిల్ కుంబ్లే (619), రవిచంద్రన్ అశ్విన్ (537), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417) మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటివరకు భారత లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లలో జహీర్ ఖాన్ (311 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును జడేజా అధిగమించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 4,000కు పైగా పరుగులు, 350కి పైగా వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా జడేజా నిలిచాడు. గతంలో ఈ రికార్డును కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డేనియల్ వెటోరి మాత్రమే సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మూడో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా జడేజానే కావడం విశేషం.








కామెంట్‌లు (0)