ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionRSA vs AUS Test: సిరీస్‌ దక్ష‍ిణాఫ్రికా కైవసం

17 గంటల క్రితం

మూడో టెస్ట్‌లో ఆస్ర్టేలియాపై  గెలుపు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 10:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మూడో టెస్ట్‌లో ఆస్ర్టేలియాపై గెలుపు

కేప్‌టౌన్‌: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య దక్ష‍ిణాఫ్రికా జట్టు 2-1తో కైవసం చేసుకుంది. మూడో టెస్ట్‌లో ఆసీస్‌ను 111 పరుగులకే ఆలౌట్‌ చేసి సఫారీ జట్టు 176పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 288 పరుగుల భారీ ఛేదనలో భాగంగా చివరి రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌ను దక్ష‍ిణాఫ్రికా బౌలర్‌ హార్మర్‌(6/16), రబడా(3/39) కట్టడి చేశారు. ఆసీస్‌ ఓపెనర్‌ హెడ్‌(14), గ్రీన్‌(27), కమిన్స్‌(11), లియాన్‌(33) మాత్రమే రెండంక్కెల స్కోర్‌ చేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హార్మర్‌కు, సిరీస్‌ యాన్సెన్‌కు దక్కాయి.

రబడా రికార్డు...

దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసి వేగంగా (బంతులపరంగా) టెస్టుల్లో 350వ వికెట్‌ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. రబడా 350వ వికెట్‌ను 13,808 బంతుల్లో తీసాడు. దీంతో డేల్ స్టెయిన్‌ (14,719 బంతులు)ను రికార్డును రబడా అధిగమించాడు. టెస్టులపరంగా మాల్కమ్ మార్షల్‌తో కలిసి నాలుగో స్థానంలో నిలిచాడు. రిచర్డ్ హ్యాడ్లీ/ డేల్‌ స్టెయిన్ 69 టెస్టుల్లోనే ఈ ఘనతను నమోదు చేశారు. డెన్నిస్ లిల్లీ (70), గ్లెన్ మెక్‌గ్రాత్ (74) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్