అకెర్మన్, ముల్డర్ శతకాలు
సెంచూరియన్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో, చివరి టెస్ట్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు భారీ ఆధిక్యతను సంపాదించింది. ఓపెనర్ అకెర్మన్, ముల్డర్ శతకాలతో రాణించడంతో ఆ జట్టు రెండోరోజు ఆట ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 494పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోర్ వికెట్ నష్టానికి 88 పరుగులతో మంగళవారం ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికాను అకెర్మన్(150), ముల్డర్(100) శతకాలకు తోడు జోర్జి(66), యాన్సెన్(67నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటికే 403 పరుగుల భారీ ఆధిక్యతను సంపాదించింది. బంగ్లా బౌలర్లు షోరిఫుల్, ఖలీద్‌కు రెండేసి, తస్కిన్, ఇబాదత్, తౌహిద్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.








కామెంట్‌లు (0)