ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

IND A vs NZ A: సెంచ‌రీకి అడుగు దూరంలో జురెల్‌

16 గంటల క్రితం

India A vs New Zealand A
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 11:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పడిక్కల్‌ అర్ధసెంచరీ

  • న్యూజిలాండ్‌-ఎతో రెండో టెస్ట్‌

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌-ఎతో జ‌రుగుతున్న రెండో అన‌ధికారిక టెస్టులో ధ్రువ్ జురెల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. పడిక్కల్‌(80) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త‌-ఎ జ‌ట్టు 7 వికెట్ల న‌ష్టానికి 291 ప‌రుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (99 బ్యాటింగ్‌; 11 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) సెంచ‌రీకి ప‌రుగు దూరంలో నిలవ‌గా, ఆకాశ్‌దీప్ (25 బ్యాటింగ్) అత‌డికి స‌హ‌క‌రిస్తున్నాడు. అంత‌కుముందు దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (80) త‌న ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ అర్థ‌శ‌త‌కంతో మెరిశాడు. సాయి సుద‌ర్శ‌న్ (41) రాణించాడు. న్యూజిలాండ్‌-ఎ బౌల‌ర్ల‌లో ఫ్రేస‌ర్ షీట్ 4 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, బ్రెట్ రాండెల్‌, జ‌ర్రోడ్ మెక్‌కే, జైడ‌న్ లెన్నోక్స్ త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్(0) రెండో టెస్టులోనూ నిరాశపరిచాడు. ఫ్రేసర్ షీట్ బౌలింగ్‌లో ఎల్బీ అయిన జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సున్నా పరుగుల వద్దే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ దశలో మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (41) రాణించగా, వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ అర్థసెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో భారత ఇన్నింగ్స్ కాస్త కుదుటపడింది. అయితే జర్రోడ్ మెకే బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయిన సాయి సుదర్శన్ అర్థసెంచరీ మిస్ చేసుకోగా, యశ్ రాథోడ్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత 140 బంతుల్లో 80 పరుగులు చేసిన పడిక్కల్ ప్రేసర్ షీట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. స్మరణ్ రవిచంద్రన్ గోల్డెన్ డక్‌ కావడంతో 137 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ ద‌శ‌లో కెప్టెన్ జురేల్ ఆచితూచి ఆడుతూ ప‌రుగులు రాబ‌ట్టాడు. ఆల్‌రౌండ‌ర్ సుంద‌ర్‌(8) ఎక్కువ‌సేపు క్రీజులో నిల‌వ‌లేదు. మాన‌వ్ సుతార్ (22) సాయంతో జురేల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అర్థ‌సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. మాన‌వ్ సుతార్ ఔటైన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన ఆకాశ్ దీప్ స్వేచ్ఛ‌గా బ్యాట్ ఝ‌లిపించ‌డంతో భార‌త్ స్కోరులో వేగం పెరిగింది. బ్యాడ్ లైట్‌తో రెండు ఓవ‌ర్ల ముందే ఆట ముగిసిన‌ట్లు అంపైర్ ప్ర‌క‌టించ‌డంతో జురేల్ 99 ప‌రుగులతో అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్‌-ఎ బౌలర్లు ఫ్రేజర్‌కు నాలుగు, ర్యాండర్‌, మెక్‌ కీ, లెనోక్స్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఇరుజట్ల మధ్య తొలి అనధికారిక టెస్ట్‌ డ్రా అయ్యిన సంగతి తెలిసిందే..

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్