జొహన్నెస్‌బర్గ్ : బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 100 పరుగులతో ఐదో, చివరిరోజు ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్ 168 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల భారీ ఆధిక్యతను సంపాదించిన దక్షిణాఫ్రికా జట్టు బంగ్లా నిర్దేశించిన 12 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. లింటన్ దాస్(39), ముష్ఫికర్(22)కి తోడు మెహిదీ హసన్(15) మాత్రమే రెండంక్కెల స్కోర్ చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు హార్మర్‌కు ఆరు, రబడాకు మూడు వికెట్లు దక్కాయి. స్వల్ప ఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్ రికెల్టన్(0)డకౌటైనా.. మార్క్‌క్రమ్(8) మ్యాచ్ ముగించాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లఓ 400 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 557 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్వెస్ అకెర్‌మాన్ (157), ర్యాన్ రికెల్టన్ (102) సెంచరీలతో చెలరేగగా.. లోయర్ ఆర్డర్‌లో కగిసో రబాడా (72) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ప్రోటీస్‌కు 157 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రబాడాకు లభించగా.. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో, చివరి టెస్ట్ 23నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది.
Print Editionతొలి టెస్టులో బంగ్లాపై దక్షిణాఫ్రికా గెలుపు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026, 10:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)