mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీలంక-ఎ 330 ఆలౌట్

2 గంటల క్రితం

team india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 10:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సత్తా చాటిన ఆకిబ్, యశ్ ఠాకూర్

గాలె: తొలి అనధికార టెస్టులో మూడో రోజు ఇండియా-ఎ బౌలర్లు ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్ కి తోడు దూబే, కంబోజ్, జైన్ రాణించడంతో శ్రీలంక ఏ జట్టుకు 170 పరుగుల ఆధిక్యత లభించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 113/2తో మూడో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక-ఎ 330 పరుగులకు ఆలౌటైంది. నువానిందు (84), అషెన్ బండార (70), సహన్ అరచ్చిగే (72) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆకిబ్ నబీ దార్ (4/58) అదరగొట్టాడు. యశ్‌ ఠాకూర్, హర్ష్‌ దూబె రెండేసి, అంశుల్ కాంబోజ్, సారాంశ్ జైన్ చెరో వికెట్ పడగొట్టారు. కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌, సాయి సుదర్శన్ సెంచరీలతో రాణించడంతో భారత్‌ 452/6 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్-ఎ జట్టు మూడోరోజు ఆట నిలిచే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. పడిక్కల్(20), పాండే(20) క్రీజ్ లో ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్