దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ప్రకటించిన టి20 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బౌలర్‌గా టీమిండియా స్పిన్నర్ శ్రీ చరణి టాప్‌లో నిలిచింది. బౌలింగ్ విభాగంలో శ్రీ చరణి టి20 ప్రపంచకప్ అగ్రస్థానంలో నిలువగా.. ఆ తర్వాత సోఫి ఎకెల్‌స్టోన్ (ఇంగ్లండ్) 723 పాయింట్లు, చార్లీడీన్ (ఇంగ్లండ్) 722 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 8వ స్థానంలో ఉంది. మరోవైపు, బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో 64 పరుగులతో రాణించి ఆసీస్‌ను విజేతగా నిలిపిన మూనీ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డునూ గెలుచుకుంది.
ఐసిసి టి20 ఉత్తమ బౌలర్‌గా శ్రీచరణి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 08, 2026, 12:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)