సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

టీమిండియా నూతన ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్

15 గంటల క్రితం

team india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 11:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీలంకతో జరగనున్న కీలకమైన టెస్ట్ సిరీస్‌కు ముందు బీసీసీఐ జట్టు టీమిండియా నూతన ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్‌ను నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న టి.దిలీప్ స్థానంలో అతడు బాధ్యతలు స్వీకరించనున్నాడు.

ఆగస్టు 15న గాలెలో జరిగే తొలి టెస్టుతో భారత్-శ్రీలంక సిరీస్ ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ మైదానంలో జరుగుతుంది. ఈ పర్యటనకు ముందు, భారత జట్టు ఆగస్టు 7 నుంచి కొలంబోలో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచే సుభదీప్ ఘోష్ తన బాధ్యతలను మొదలుపెట్టనున్నాడు.

57 ఏళ్ల సుభదీప్ ఘోష్‌కు కోచింగ్‌లో విస్తృతమైన అనుభవం ఉంది. గతంలో రెండేళ్లపాటు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించాడు. 2022 మహిళల వన్డే ప్రపంచకప్, 2023 టీ20 ప్రపంచకప్‌లలో అత‌ను జట్టుతో పనిచేశాడు. అంతేగాక ఇండియా 'ఏ' జట్లకు, అసోం సీనియర్ పురుషుల జట్టుకు హెడ్ కోచ్‌గా కూడా వ్యవహరించాడు. ఆటగాడిగా అసోం, రైల్వేస్ తరఫున 17 ఫస్ట్-క్లాస్, 17 లిస్ట్ 'ఏ' మ్యాచ్‌లు ఆడాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్