టి20 ప్రపంచకప్ లో మహిళలు..
ఐర్లాండ్ తో పురుషుల జట్టు కీలక పోరు
క్రికెట్‌లో టీమిండియా పురుషుల, మహిళల జట్లు నేడు కీలక మ్యాచ్‌లు ఆడనున్నాయి. భారత పురుషుల జట్టు రెండు టి20ల సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లి తొలి టి20లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఆదివారం జరిగే రెండో టి20లో గెలిస్తేనే సిరీస్‌ను సమం చేయనుంది. ఈ మ్యాచ్ ఓడితే తొలిసారి ఐర్లాండ్ పర్యటనలో సిరీస్‌ను కోల్పోయే ప్రమాదముంది. ఇక మహిళలజట్టు టి20 ప్రపంచకప్‌లో టీమిండియా పటిష్ట ఆస్ట్రేలియా మహిళలతో కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారతజట్టుకు సెమీస్ బెర్త్ దక్కనుంది. ఆసీస్ మహిళల చేతిలో టీమిండియా ఓడితే.. ఈ మ్యాచ్‌కు ముందు జరిగే బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళలు ఓటమిపాలవ్వాలి. దీంతో నేడు క్రికెట్ అభిమానులకు డబుల్ మజా దక్కనుంది.









కామెంట్‌లు (0)