మహారాష్ట్రపై ఏడు వికెట్ల తేడాతో గెలుపు
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ
మొహాలీ: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు మరో విజ యాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్-సిలో భాగంగా గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 7వికెట్ల తేడాతో మహారాష్ట్రపై విజయం సాధించింది. మహారాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కులకర్ణి(56) అర్ధసెంచరీకి తోడు రంజిత్(33), సిద్ధేవ్(32) బ్యాటింగ్‌లో రాణించారు. ఆంధ్ర బౌలర్లు కలిదిండి రాజుకు మూడు, సత్యనారాయణ రాజుకు రెండు, యశ్వంత్‌కు ఒక వికెట్ దక్కాయి. అనంతరం మారమ్రెడ్డి (64), షేక్ రషీద్(53) అర్ధసెంచరీలకి తోడు అశ్విన్ హెబ్బర్(34) రాణించి 19.2 ఓవర్లలో 181 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. మహారాష్ట్ర బౌలర్లు సిద్ధేశ్‌కు రెండు, ముఖేష్ చౌదరికి ఒక వికెట్ లభించాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అశ్విన్ హెబ్బర్‌కు లభించింది. దీంతో గ్రూప్-సిలో ఆంధ్ర జట్టు 7 మ్యాచ్‌లు ముగిసేసరికి 6 విజయా లతో 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
జాదవ్‌పూర్ యూనివర్శిటీలో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 5వికెట్ల తేడాతో ఒడిషాపై విజయం సాధించింది. ఒడిషా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. హైదరాబాద్ 19.1ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు విజయం సాధించింది.








కామెంట్‌లు (0)