జింబాబ్వేపై 43పరుగుల తేడాతో గెలుపు
ముక్కోణపు టి20 సిరీస్
విండ్‌హోక్(నమీబియా): ముక్కోణపు టి20 సిరీస్ ఫైనల్లోకి దక్షిణాఫ్రికా జట్టు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 43 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రిటోరియస్(94; 51బంతుల్లో 12ఫోర్లు, 3సిక్సర్లు)కి తోడు జోర్డాన్(28) తొలి వికెట్‌కు 68పరుగులు జోడించారు. ఆ తర్వాత బ్రెవీస్(41; 27బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) రాణించారు. జింబాబ్వే బౌలర్లు వాధేరాకు మూడు, ఎవాన్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం జింబాబ్వేను సఫారీ కెప్టెన్, బౌలర్ ఫోర్టన్(4/24)కి తోడు యాన్సెన్(3/21) కట్టడి చేశారు. కెప్టెన్ సికిందర్ రాజా(45), న్యాంహూరీ(27), కియా(18) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రెటోరియస్‌కు దక్కింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా 3మ్యాచుల్లో 4పాయింట్లు(+1.38రన్‌రేట్)తో ఫైనల్‌కు చేరగా.. రెండో బెర్త్‌కోసం జింబాబ్వే, నమీబియా రేసులో ఉన్నాయి.








కామెంట్‌లు (0)