ఒకే ఓవర్లో మూడు వికెట్లు
తొలి టెస్ట్‌లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయం
గాలే: శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారతజట్టు 199 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించి రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో నిలిచింది. లంచ్ విరామానికి 199/6తో పటిష్టంగా ఉన్న శ్రీలంక జట్టును మానవ్ సుతార్ దెబ్బకొట్టాడు. ఆ స్కోర్ వద్దే మూడు వికెట్లు పడగొట్టి టీమిండియాకు గెలుపు ఖాయం చేశాడు. ఈ టెస్ట్‌లో మొత్తం పది వికెట్లు తీసిన మానవ్.. భారత దిగ్గజ స్పిన్నర్ల చెంతన చేరాడు. ఓవర్‌నైట్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 84పరుగులతో ఐదో, చివరిరోజు ఆటను కొనసాగించిన శ్రీలంక జట్టును కెప్టెన్ ధనుంజయ, సొనాల్ దినుషా అర్ధసెంచరీలో రాణించి ఆదు కున్నారు. ధనుంజయ డి-శిల్వ 59పరుగులతో, సొనాల్ దినుషా(84) పరుగులతో మెరిసాడు. వీరిద్దరు తొలి సెషన్‌లో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. దీంతో లంచ్ సమయానికి శ్రీలంక జట్టు 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
లంచ్ తర్వాత మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలంతో శ్రీలంక బ్యాటర్లను వరుసగా పెవీలియన్‌కు పంపాడు. లంక స్కోర్ 196 పరుగుల వద్ద వరుసగా ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఈ టెస్ట్‌లో 10 వికెట్లతో రాణించిన మానవ్ సుతార్... టీమిండియా దిగ్గజ మాజీ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ సరసన చేరాడు. శ్రీలంకలో భారత బౌలర్ అత్యుత్తమ మ్యాచ్ బౌలింగ్ గణాంకాల్లో సుతార్ 10/131తో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ గెలుపుతో భారత్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించిన దేవదత్ పడిక్కల్ (167 పరుగులు)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కొలంబో వేదికగా ఆగస్టు 23నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.
స్కోర్‌బోర్డు...
ఇండియా తొలి ఇన్నింగ్స్: 462పరుగులు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 284పరుగులు
ఇండియా రెండో ఇన్నింగ్స్: 193పరుగులు
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: మధుశంక (సి)ప్రసిధ్ (బి)సిరాజ్ 6, ఉదాన (సి)జురెల్ (బి)మానవ్ సుతార్ 16, సూర్యభండార (ఎల్‌బి)మానవ్ సుతార్ 0, కమిందు మెండీస్ (సి)కెఎల్ రాహుల్ (బి)ప్రసిధ్ 2, ధనుంజయ (సి)మానవ్ (బి)జడేజా 59, దినుషా (సి)జురెల్ (బి)మానవ్ 84, డిక్వెల్లా (సి)పంత్ (బి)ప్రసిధ్ 10, నువాంత (బి)మానవ్ 20, జయసూరియ (బి)మానవ్ 0, లాహిరు కుమార (సి)పంత్ (బి)మానవ్ 0, ఫెర్నాండో (నాటౌట్) 0, అదనం 9. (77.4ఓవర్లలో ఆలౌట్) 206పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/14, 3/21, 4/47, 5/142, 6/156, 7/199, 8/199, 9/199, 10/206.
బౌలింగ్: సిరాజ్ 9-2-15-1, మానవ్ సుతార్ 23.4-2-55-6, ప్రసిద్ కృష్ణ 10-3-16-2, జడేజా 23-3-71-1, కుల్దీప్ 11-0-38-0, పడిక్కల్ 1-0-5-0.







కామెంట్‌లు (0)