ముంబయి: రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్-డిలో ముంబయి పేసర్ తుషార్ దేశ్‌పాండే హాట్రిక్‌తో మెరిసాడు. ఛండీగడ్‌తో ప్రారంభమైన గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా సోమవారం అర్జున్ జమాద్, శివమ్ బాంబ్రీ, దీపెందర్ కుష్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి మరో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 2023 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ మిజోరాంపై హ్యాట్రిక్ వికెట్లతో మెరిసిన తుషార్.. మరోసారి రంజీట్రోఫీలో ఆ స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో తొలి లిన్నింగ్స్‌లో ఛండీగడ్ కేవలం 19.1ఓవర్లలో కేవలం 78పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు ముంబయి జట్టు తొలి ఇన్నింగ్స్‌లఓ 420పరుగులకు ఆలౌటవ్వడంతో ఆ జట్టుకు 322 పరుగుల ఆధిక్యత లభించింది. అనంతరం ఫాలో ఆన్ ఆడుతూ ఛండీగడ్ జట్టు మూడోరోజు ఆట నిలిచే సమయానికి కష్యప్(0) వికెట్‌ను కోల్పోయింది.
తుషార్ దేశ్‌పాండే హ్యాట్రిక్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026, 12:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)