మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionషఫీక్‌ ‌భారీ శతకం

3 గంటల క్రితం

pakistan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 11:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 
పాకిస్తాన్‌‌కు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత

ట్రినిడాడ్‌: వెస్టిండీస్‌‌తో జరుగుతున్న రెండో, చివరి టెస్ట్‌‌లో పాకిస్తాన్‌ ‌జట్టు తొలి ఇన్నింగ్స్‌‌లో ఆధిక్యత సంపాదించింది. మిడిలార్డర్‌ ‌బ్యాటర్‌ అబ్దుల్లా షఫీక్‌(153‌నాటౌట్‌) ‌భారీ శతకానికి తోడు.. కెప్టెన్‌ ‌బాబర్‌ అజామ్‌(88) తృటిలో శతకాన్ని మిస్‌ ‌చేసుకున్నాడు. మూడోరోజు 105ఓవర్ల మ్యాచ్‌ ‌ముగిసేసరికి పాకిస్తాన్‌ ‌జట్టు 6 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ ‌జట్టు తొలి ఇన్నింగ్స్‌‌లో 344 పరుగులకే పరిమితం కావడంతో పాక్‌ ‌జట్టుకు 20 పరుగుల ఆధిక్యత లభించింది. ఓవర్‌‌నైట్‌ ‌స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 266పరుగులతో మూడోరోజు ఆటను కొనసాగించిన పాకిస్తాన్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ ‌బాబర్‌(88) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత జఫార్‌(1), అఘా సల్మాన్‌(0), రిజ్వాన్‌(18) స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌‌కు చేరారు. కానీ ఓవర్‌‌నైట్‌ ‌మరో బ్యాటర్‌ ‌షఫీక్‌ భారీ శతకంతో క్రీజ్‌‌లో నిలిచి పాకిస్తాన్‌‌ను ఆధిక్యతకు దోహదపడ్డాడు. సాజిద్‌ ‌ఖాన్‌(27) క్రీజ్‌‌లో ఉన్నాడు. విండీస్‌ ‌బౌలర్లు వారీకాన్‌‌కు మూడు, జోసెఫ్‌‌కు రెండు వికెట్లు దక్కాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్