బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టు తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 6వికెట్ల నష్టానికి 79పరుగులతో శనివారం నాల్గోరోజు ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్ జట్టు 142పరుగులకు ఆలౌటైంది. నయీమ్ హసన్(52) అర్ధసెంచరీ మినహా మిగతా బ్యాటర్లంతా నిరాశపరిచారు. విండీస్ బౌలర్, కెప్టెన్ రోస్టన్ ఛేస్ (5/36), వర్రికన్(4/63) బౌలింగ్‌లో రాణించి బంగ్లాను కట్టడి చేశారు. దీంతో వెస్టిండీస్ ముందు కేవలం 170పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం వెస్టిండీస్ 35.1ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్ కింగ్(81నాటౌట్), క్యాంప్‌బెల్(49), చంద్రపాల్(1)కి తోడు హోడ్జే(31) క్రీజ్‌లో నిలిచి మ్యాచ్‌ను ముగించారు. బంగ్లాదేశ్ బౌలర్లు ఇస్లామ్, మహమూద్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వర్రికన్‌కు లభించింది. రెండో, చివరి టెస్ట్ నవంబర్ 5నుంచి షెహెట్ వేదికగా జరగనుంది.








కామెంట్‌లు (0)