ఐసిసి మహిళల టి20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక పాయింట్లు
దుబాయ్: భారత యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో రికార్డులను నెలకొల్పుతోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసిన మహిళల టి20 బౌలర్ల జాబితాలో 817 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ క్రమంలో శ్రీచరణి ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది. బౌలింగ్ విభాగంలో టి20 ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు (817) సాధించిన బౌలర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్ పేసర్ మెగాన్ షట్ (806) రికార్డును బద్దలు కొట్టింది. ఆసియా క్రీడల్లో అద్భుతంగా రాణించడంతో శ్రీ చరణి రేటింగ్ పాయింట్లు పెరిగాయి. మరోవైపు భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకుని టాప్-5లోకి ప్రవేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ రరీచా ఘోష్ కూడా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు మెరుగుపరుచుకొని తాజా ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో నిలిచింది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా నాలుగు స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకోగా.. బంగ్లాదేశ్ బ్యాటర్ షర్మిన్ అక్తర్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 35వ స్థానంలో నిలిచారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్ నష్రా సంధు తిరిగి టాప్-10లోకి వచ్చింది. బంగ్లాదేశ్ స్పిన్నర్ నహిదా అక్తర్, పాకిస్థాన్ ఉమ్-ఎ-హానీ, భారత్‌కు చెందిన క్రాంతి గౌడ్ కూడా తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి చేరుకుంది.








కామెంట్‌లు (0)