ఏడోసారి కైవసం
ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై ఘనవిజయం
మహిళల టీ20 ప్రపంచకప్
లండన్: మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ విధించిన 151 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆస్ర్టేలియా ఛేదించింది. బెత్ మూనీ (64) హాఫ్ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించగా, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (48), ఎలీస్ పెర్రీ (13 నాటౌట్), జార్జియా వోల్ (9) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షార్లెట్ డీన్, లారెన్ బెల్, సోఫీ ఎకిల్‌స్టోన్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ఆస్ర్టేలియా టీ20 ప్రపంచకప్‌ను ఏడోసారి తన ఖాతాలో వేసుకుంది. 2010, 2012, 2014, 2018, 2020, 2023ల్లోనూ ఆస్ర్టేలియా ప్రపంచకప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ఆస్ర్టేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 150/4 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌లో ఓపెనర్లు అమీ జోన్స్ (6), డాని వ్యాట్-హాడ్జ్ (8) తీవ్రంగా నిరాశపర్చినా వీరి తరువాత వచ్చిన నాట్‌సీవర్ బ్రంట్ 58 (నాటౌట్)- అలీస్ క్యాప్సీ (23) జోడీ జట్టును ఆదుకుంది. క్యాపీ అవుట్ తరువాత హెదర్ నైట్ (2 ) విఫలం చెందిన మళ్లీ ఫ్రేయా కెంప్ (44 ) నాటౌట్ గా నిలిచింది. . ఆస్ట్రేలియా బౌలర్లలో కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, సోఫీ, అన్నాబెల్ సదర్లాండ్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ . టోర్నీలో ఇరు జట్లు ఒక్క మ్యాచూ ఓడకుండా ఫైనల్ చేరడం విశేషం. 2012, 2014, 2018 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇంగ్లాండ్ ఈసారి కూడా ఓటమి చవిచూసింది. ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‌గానూ, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను బెత్ మూనీ నిలిచింది.








కామెంట్‌లు (0)