నేడు జింబాబ్వేతో తొలి టి20
సాయంత్రం 4.30గం.ల నుంచి
హరారే: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా మూడు టి20ల సిరీస్ ఆడేందుకు జింబాబ్వేలో ఉంది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా గురువారం తొలి టి20 జరగనుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఎదురైన చేదు అనుభవాల నుండి గుణపాఠాలు నేర్చుకుంటూ, ఈ సిరీస్‌లో విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని యువ క్రికెటర్ల బృందంతో దుర్భేధ్యఫామ్‌లో ఉంది. అయితే ఈ తొలి మ్యాచ్‌కి ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జింబాబ్వే పర్యటనకు తనకు తొలిసారి అని, తప్పక సిరీస్ గెలుస్తామని వెల్లడించాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో తమ ప్రదర్శన అంత బాగా లేదని, కానీ ఆ ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకున్నామని పేర్కొన్నాడు. జట్టులో చాలామంది ఆటగాళ్లకు ఇదే తొలి జింబాబ్వే పర్యటన అని తెలిపాడు. వారు వీలైనంత త్వరగా ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, మూడు మ్యాచ్‌ల టి0 సిరీస్ ఈ నెల 23 నుంచి హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు కూడా అదే వేదికపై జరగనున్నాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని యువ భారత జట్టు ఈ సిరీస్‌లో విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లాండ్ పర్యటనలో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు పలువురు ఆటగాళ్లు నేరుగా హరారేకు చేరుకోగా, మిగతా సభ్యులు తాత్కాలిక కోచ్ వివిఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో భారత్ నుంచి జింబాబ్వేకు బయల్దేరి వెళ్లారు. రెండో టి20 జూలై 25న, మూడో టి20 జూలై 26న జరగనున్నాయి.
ఇండియా : శ్రేయస్(కెప్టెన్), అభిషేక్, ఇషాన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, దూబే, రింకు సింగ్, సుయాన్ష్ షెడ్జే, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, బిష్ణోయ్.
జింబాబ్వే: సికిందర్ రాజా(కెప్టెన్), బెన్నెట్, మరుమణి(వికెట్ కీపర్), మయర్స్, బర్ల్, ఎవాన్ష్, మసకడ్జా, మధవేరా, మిల్టన్ షుంబా, నరవా, ఛివాంగా, ముజరబ్బాని, కర్రన్, టిగా, న్యాంహురి.







కామెంట్‌లు (0)