mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అదరగొట్టిన హర్మన్ ప్రీత్ సేన

1 రోజు క్రితం

women team
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 11:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లీడ్స్: ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్‌ లో టీమిండియా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘన సాధించింది. హెడింగ్లీ వేదిక బుధవారం జరిగిన గ్రూప్-ఎ రెండో లీగ్ మ్యాచ్ లో భారత జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ మహిళలపై ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై అదే తరహా విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్‌ను 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్‌ చేసింది. భారత ఓపెనర్లు స్మృతి మంధన (74; 47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్), షెఫాలీ వర్మ (55; 38 బంతుల్లో10 ఫోర్లు) చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చిఖర్లో రిచా ఘోష్‌ (20 నాటౌట్‌; 8 బంతుల్లో ఫోర్‌, 2 సిక్సర్లు), దీప్తి శర్మ (10 నాటౌట్‌; 2 బంతుల్లో ఫోర్‌, సిక్స్‌), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (9 బంతుల్లో 12; 2 ఫోర్లు) బ్యాట్‌ ఝుళిపించారు. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్‌ ఆదిలోనే చేతులెత్తేసింది. టాప్‌-4 బ్యాటర్స్‌ మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయారు. భారత స్పిన్నర్ల ధాటికి నెదర్లాండ్స్‌ ప్లేయర్లంతా బెంబేలెత్తిపోయారు. స్పిన్నర్ శ్రీ చరణి (4/19) దెబ్బకు నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. షెఫాలీ వర్మ (3/20) కూడా తోడవ్వడంతో నెదర్లాండ్స్‌ చివరి 5 వికెట్లు కేవలం 9 బంతుల వ్యవధిలో కోల్పోయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మంధానాకు దక్కింది. 21న భారత మహిళలజట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్