లక్నో: ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించి మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తో బుధవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ భారీ శతకాలతో రాణించడంతో 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ ఛేదనలో ఆఫ్ఘన్ జట్టు 44.3ఓవర్లలో 232 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘన్ జట్టులో రామత్ షా(79), సెద్ధిఖుల్లా(42), గుర్బాజ్(41) మాత్రమే బ్యాటింగ్ లో రాణించగా.. టీమిండియా బౌలర్లు గుర్నూర్ బ్రార్, ఆర్ష్ దీప్ కు మూడేసి, ప్రిన్ష్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్(4) నిరాశపరిచినా.. కెప్టెన్ గిల్, రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. హిట్ మ్యాన్ రోహిత్ అర్ధ సెంచరీకి చేరువులో 48 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులో అడుగుపెట్టిన ఇషాన్ తన ఇన్సింగ్స్‌ను నెమ్మదిగా ఆరభించినా అర్ద సెంచరీ తర్వాత గేర్ మార్చి ఫోర్లు, సిక్సర్లతో ఆఫ్గాన్ బౌలర్లకు చుక్కుల చూపాడు. కిషన్ 79బంతుల్లో 14 ఫోర్లు, 7సిక్సర్లతో 125 పరుగులు చేయగా.. కెప్టెన్ శుభ్ మన్ 110 బంతుల్లో 22ఫోర్లు, 2సిక్సర్లతో 154 పరుగులు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 222 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కేఎల్ రాహుల్ డౌకౌట్ కాగా.. శ్రేయాస్ అయ్యర్(26), వాషింగ్టన్ సుందర్(19) పరుగులతో రాణించారు. ఆఫ్గనిస్తాన్ బౌలర్లలో నంగేలియా 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు ఘజన్‌ఫర్, మహ్మద్ సలీం తలా ఒక వికెట్ పడొగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గిల్ కు లభించగా.. మూడో, చివరి వన్డే చిదంబరం స్టేడియం వేదికగా శనివారం జరగనుంది.
శుభ్‌మన్, ఇషాన్ సెంచరీలు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 11:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)