మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA : ఫైనల్ ముగిసినా ఫైట్ ఆగలేదు..

1 రోజు క్రితం

FIFA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 07:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • స్పెయిన్ ఆటగాడిపై కూడా అర్జెంటీనా ప్లేయర్ పిడిగుద్దులు

ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్లో స్పెయిన్ విజయం సాధించిన ఆనందంలో ఆటగాళ్లందరూ మైదానంలో ఒకరినొకరు కౌగిలించుకుంటూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో న్యూజెర్సీ మైదానంలో ఉద్రిక్తత నెలకొంది. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన అర్జెంటీనా ఆటగాళ్లు స్పెయిన్ ప్లేయర్లతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో లియాండ్రో పరేడెస్ స్పెయిన్ యువ ఆటగాడు గావిని కిందకు తోసేయగా, మరో స్పెయిన్ ఆటగాడిపై కూడా అర్జెంటీనా ప్లేయర్ పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో రిఫరీ జోక్యం చేసుకుని దాడికి పాల్పడిన ఆటగాళ్లకు రెడ్ కార్డులు చూపించారు. అయినప్పటికీ, అర్జెంటీనా ఆటగాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా స్పెయిన్ ప్లేయర్లతో ఘర్షణను కొనసాగించారు. సెక్యూరిటీ సిబ్బంది, సీనియర్ ఆటగాళ్లు రంగంలోకి దిగి ఇరు జట్లను విడదీయడంతో గొడవ సద్దుమణిగింది. ప్రపంచ కప్ లాంటి అత్యున్నత వేదికపై ఈ రకమైన దురుసు ప్రవర్తనకు దిగడంపై క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన ఆటగాళ్లపై ఫిఫా ఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్