మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA: స్పెయిన్ జట్టుపై కాసుల వర్షం

1 రోజు క్రితం

spain
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 07:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఫిఫా ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుపై కాసుల వర్షం కురిసింది. ట్రోఫీతో పాటు ఏకంగా 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ.420 కోట్లు) ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. న్యూజెర్సీలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో అర్జెంటీనాను 1-0తో ఓడించి 2010 తర్వాత రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడిన స్పెయిన్‌కు ఈ భారీ నగదు బహుమతి దక్కింది.

ఈ చారిత్రక విజయంతో స్పెయిన్‌కు భారీ జాక్‌పాట్ కూడా దక్కింది. బీబీసీ కథనం ప్రకారం, విజేతగా నిలిచిన స్పెయిన్‌కు ప్రైజ్ మనీ రూపంలో ఏకంగా 51 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 492.86 కోట్లు) అందనున్నాయి. మరోవైపు, ఫైనల్లో పోరాడి ఓడిన రన్నరప్ అర్జెంటీనాకు కూడా 34 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 327.37 కోట్లు) ప్రైజ్ మనీగా లభించనుంది.

ఈసారి ఫిఫా ప్రపంచకప్ కోసం రికార్డు స్థాయిలో 871 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8385 కోట్లు) ప్రైజ్ మనీని కేటాయించింది. దీనిలో భాగంగా మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 30 మిలియన్ డాలర్లు, నాలుగో స్థానంలోని జట్టుకు 28 మిలియన్ డాలర్లు అందుతాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (5 నుంచి 8వ స్థానం) 20 మిలియన్ డాలర్ల చొప్పున, అలాగే టోర్నీలో పాల్గొన్న మొత్తం 48 జట్లకు వాటి ప్రదర్శన ఆధారంగా వేర్వేరు స్థాయిలలో ప్రైజ్ మనీని పంపిణీ చేయనున్నారు. అన్ని జట్లకు కలిపి సుమారు 703 మిలియన్ డాలర్లు పంచుతుండగా, మిగిలిన 168 మిలియన్ డాలర్లను ప్రదర్శనతో సంబంధం లేకుండా పాల్గొన్న అన్ని జట్లకు సమానంగా పంచనుండటం విశేషం.

గోల్డెన్ బాల్ – రోడ్రి (స్పెయిన్)

గోల్డెన్ గ్లోవ్ – ఉనై సిమోన్ (స్పెయిన్)

బెస్ట్ యంగ్ ప్లేయర్‌ - పావ్ కుబార్సి (స్పెయిన్)

గోల్డెన్ బూట్ – కిలియన్ ఎంబాప్పే

ఫిఫా ఫెయిర్ ప్లే ట్రోఫీ – నెదర్లాండ్స్


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్