మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA: స్పెయిన్‌, స్వీడన్‌ ‌ముందుకు...

1 గంట క్రితం

fifa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 12:09 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రీ క్వార్టర్స్‌‌లో ఓడిన పోర్చుగల్‌, అమెరికా

ఫిఫా ప్రపంచకప్‌ 2026

​సియాటెల్‌: ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆతిథ్య జ‌ట్ల పోరు ముగిసింది. టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా జట్టు ప్రీ క్వార్టర్‌‌ఫైనల్లో ఓటమిపాల వ్వగా.. మరో ఆతిథ్య దేశాలైన కెనడా, మెక్సికో ఇప్పటికే టోర్నీ నుంచి నిష్ర్కమించాయి. సియాటెల్‌ ‌స్టేడియంలో మంగళవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో బెల్జియం 4-1 గోల్స్ తేడాతో అమెరికాను ఓడించి క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశించింది. బెల్జియం త‌ర‌పున డీ కెలిటేరి 9, 33 నిమిషాల్లో రెండు గోల్స్‌ ‌చేయగా.. వాన‌కేన్ 57వ నిమిషంలో, లుకాకు 93వ నిమిషంలో గోల్ చేశారు. ఇక అమెరికా త‌ర‌పున టిల్‌మాన్ 31వ నిమిషంలో గోల్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా డిఫెన్స్ బ‌ల‌హీన‌త బ‌య‌ట‌ప‌డింది. బెల్జియం దూకుడును ఏమాత్రం అమెరికా డిఫెండ‌ర్లు అడ్డుకోలేక‌ పోయారు. అమెరికా ఫార్వ‌ర్డ్ ప్లేయ‌ర్ ఫొలారిన్ బ‌లోగ‌న్ ఈ మ్యాచ్‌లో ఆడాడు. ట్రంప్ జోక్యంతో అత‌నిపై ఓ మ్యాచ్ స‌స్పెన్ష‌న్‌ను ఫిఫా ర‌ద్దు చేసింది. వివాదాస్ప‌ద రీతిలో బ‌లోగ‌న్‌ను ఆడించారు.

​ఉత్కంఠ పోరులో పోర్చుగల్‌‌ చిత్తు

టెక్సాస్‌ స్టేడియంలో జరిగిన మరో ప్రీ క్వార్టర్‌ ఫైనల్లో పోర్చుగ‌ల్ కథ ముగిసింది. ఇదే చివరి ప్రపంచకప్‌ అని ప్రకటించి బరిలోకి దిగిన పోర్చుగల్‌ ‌స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో జట్టును క్వార్టర్‌‌ఫైనల్‌‌కు చేర్చడంలో విఫల మయ్యాడు. బలమైన డిఫెన్స్‌‌కు పేరుగాంచిన స్పెయిన్‌ ‌చివరి వరకు పోర్చుగల్‌ ఆటగాళ్లను నిలువరించడంతో సఫలమైంది. కానీ చివర్లో గోల్‌ ‌కొట్టి ‌విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌లో స్పెయిన్‌ జట్టు 1-0తో పోర్చుగల్‌ను ఓడించింది. స్టాపేజ్ టైంలో స్పెయిన్ ప్లేయ‌ర్ మైఖేల్ మెరినో 91వ నిమిషంలో గోల్ చేసి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఫెర్ర‌న్ టోర‌స్ నుంచి పాస్ అందుకున్న మెరినో.. పోర్చుగ‌ల్ గోల్‌కీప‌ర్ డియోగో కోస్టాను బీట్ చేసి గోల్ చేశాడు. పోర్చుగ‌ల్ సూప‌ర్‌స్టార్ క్రిస్టియానో రోనాల్డో త‌మ జ‌ట్టును ఆదుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు. కానీ అత‌ని పోరాటం ఫ‌లించ‌లేదు. దీంతో ప్ర‌పంచ‌క‌ప్‌లో రోనాల్డో కెరీర్ ముగిసిపోయింది. ఇదే త‌న‌కు చివ‌రి వ‌ర‌ల్డ్‌క‌ప్ అని రోనాల్డో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2010 ప్ర‌పంచ క‌ప్ గెలిచిన త‌ర్వాత తొలిసారి మ‌ళ్లీ క్వార్ట‌ర్స్ ద‌శ‌లోకి స్పెయిన్ ప్ర‌వేశించింది. ఫ‌స్ట్ హాఫ్‌లో ఇరు జ‌ట్లు తీవ్రంగా పోరాడాయి. కానీ ఒక్క జ‌ట్టు కూడా గోల్ చేయ‌లేక‌పోయింది. స్పెయిన్ త‌ర‌పున మైఖేల్ ఒయ‌ర్‌జ‌బాల్ .. ప్ర‌త్య‌ర్థి గోల్ పోస్టుపై మెరుపు దాడులు చేశాడు. కానీ గోల్స్ రాలేక‌పోయాయి. ఇక పోర్చుగ‌ల్ త‌ర‌పున క్రిస్టియానో రోనాల్డో కూడా దూకుడుగా ఆడాడు. స్పెయిన్ గోల్ పోస్టుపై అటాక్ చేశారు. కానీ అత‌ను కూడా స‌క్సెస్ కాలేదు. ఇక సెకండ్ హాఫ్‌లో రెండు జ‌ట్లు జాగ్ర‌త్త‌గా ఆడాయి. కానీ ఎక్స్‌ట్రా టైంలో వ‌చ్చిన ఇద్ద‌రు సబ్‌స్టిట్యూట్లు.. స్పెయిన్‌కు విజ‌యాన్ని అదించారు. ఫెర్ర‌న్ టోరెస్, మెరినో క‌లిసి గోల్ చేశారు. మ్యాచ్‌కు ముందే ఇదే త‌న చివ‌రి వ‌ర‌ల్డ్‌క‌ప్ అని క్రిస్టియానో రోనాల్డో పేర్కొన్న విష‌యం తెలిసిందే. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పోర్చుగ‌ల్ ఓట‌మితో రోనాల్డో అంత‌ర్జాతీయ కెరీర్ ముగిసింది. 41 ఏళ్ల రోనాల్డో.. ప్ర‌పంచ‌క‌ప్ పోటీల్లో 27 మ్యాచ్‌లు ఆడి 11 గోల్స్ చేశాడు. కానీ వ‌రుస‌గా ఆరు వ‌ర‌ల్డ్‌క‌ప్స్‌లో గోల్స్ చేసి కొత్త రికార్డును స్థాపించాడు. అయితే అంత‌ర్జాతీయ మ్యాచుల్లో మాత్రం అత‌ను అత్య‌ధికంగా 146 గోల్స్ చేశాడు. ఈ టోర్న‌మెంట్‌లో రోనాల్డో మూడు గోల్స్ చేశాడు. కానీ స్పెయిన్ గోల్ కీప‌ర్ ఉనై సిమ‌న్ గీత‌ను దాట‌లేక‌పోయాడు. ఈ టోర్నీలో సిమ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క గోల్ కూడా ప్ర‌త్య‌ర్థుల‌కు ఇవ్వ‌లేదు. ఈ టోర్నీలో 609 నిమిషాల పాటు గోల్ కీపింగ్ చేసిన సిమ‌న్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క గోల్ కూడా అత‌ను స‌మ‌ర్పించ‌లేదు. ​క్వార్ట‌ర్‌ ఫైనల్లో స్పెయిన్‌తో బెల్జియం త‌ల‌ప‌డ‌నుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్