బ్యూనస్‌ఎయిర్: 2016లోనే తొలిసారి అంతర్జాతీయ పోటీలకు గుడ్‌బై చెప్పిన లియోనెల్ మెస్సీ ఆ ప్రకటనను వెనక్కి తీసుకొని మరో పదేళ్లపాటు అర్జెంటీనాకు ఆడాడు. ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. మైదానంలో మెస్సీ వేసే మెరుపు అడుగులు, గోల్స్ సాధించే నైపుణ్యం కోట్లాది మంది అభిమానులను అలరించాయి. ఈ క్రమంలోనే 2022లో అర్జెంటీనా జట్టుకు సారథ్యం వహించి మెస్సీ.. ఫిఫా ప్రపంచకప్‌ను తన నేతృత్వంలో అందించాడు. మెస్సీ జట్టులోకి రాకముందు 1978, 1986లలో రెండుసార్లు టైటిల్ కొట్టిన అర్జెంటీనా.. ఆ తర్వాత మెస్సీ అర్జెంటీనా తరఫున అరంగేట్రంతో పూర్తిగా మారిపోయింది. ఆటగానిగా కొనసాగుతున్న క్రమంలో 2014లో రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా.. 2022లో అతని సారథ్యంలో ఏకంగా ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను ముద్దాడింది. దీంతో దాదాపు 38ఏళ్ల తర్వాత అర్జెంటీనా మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్‌లోనూ చారిత్రాత్మక విజయలను నమోదు చేసుకుంది. టైటిల్‌కు అడుగు దూరంలో ఓడి వరుసగా రెండోసారి టైటిల్ కొట్టే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. దీంతో నాల్గోసారి (1930, 1990, 2014, 2026) రన్నరప్‌కే పరిమితమైంది. 39 ఏళ్ల మెస్సీ తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అర్జెంటీనా తరఫున 207 మ్యాచ్‌లు ఆడి 125 గోల్స్ చేశాడు. 2022లో జట్టును ప్రపంచ విజేతగా నిలిపాడు. నవతరం ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని భావోద్వేగం తో వీడ్కోలు పలికాడు. 20 ఏళ్ల పాటు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ట్విట్టర్ ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలిపాడు. మెస్సీ తన కెరీర్‌లో తొలి గోల్‌ను 2006లో క్రొయేషియాపై కొట్టాడు. ఇక చివరి గోల్ 2026 ఫిఫా ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌తో మ్యాచులో కొట్టాడు. అర్జెంటీనాకు వీడ్కోలు పలికినప్పటికీ మెస్సీ మాత్రం క్లబ్ ఫుట్‌బాల్ మాత్రం ఆడనున్నాడు. అతడు ప్రస్తుతం మేజర్ లీగ్ సాకర్ క్లబ్ ఇంటర్ మయామి కెప్టెన్‌గా ఉన్నాడు. మొత్తంగా ఆరు ప్రపంచకప్‌లు ఆడిన మెస్సీ.. ఏకంగా 21 గోల్స్ కొట్టాడు. మెస్సీ వీడ్కోలుపై తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మెస్సీ.. యావత్ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించారని, హైదరాబాద్‌లో ఆయనతో ఫుట్‌బాల్ మైదానంలో కాసేపు గడపడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
Print Editionఅంతర్జాతీయ వేదికలపై మెస్సీ మెరుపులు ఇక చూడలేం..
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 11:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)