శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionముగిసిన 5వ ఆసియా పారా క్రీడలు

1 గంట క్రితం

భారత్‌కు రికార్డు పతకాలు త్రివర్ణ పతాక ధారులుగా మోనా, నిషాద్‌
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 10:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • భారత్‌కు రికార్డు పతకాలు

  • త్రివర్ణ పతాక ధారులుగా మోనా, నిషాద్‌

నగోయా: జపలోని ఐచి-నగోయా వేదికగా జరిగిన 5వ ఆసియా పారా క్రీడలు శనివారంతో ముగిసాయి. ముగింపు వేడుకల్లో త్రివర్ణ పతాకధారులుగా మోనా అగర్వాల్, నిషాద్ కుమార్ వ్యవహరించారు. 2026 ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు ఈసారి రికార్డు స్థాయిలో పతకాలు దక్కాయి. 2023 హాంగ్జౌ వేదికగా జరిగిన 4వ ఆసియా పారా క్రీడల్లో 108 పతకాలు లభించగా.. ఈసారి మరో 6 పతకాలు అత్యధికంగా దక్కాయి. దీంతో 114 అత్యధిక పతకాలతో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఇందులో 30స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పతకాల పట్టికలోనూ భారత్‌ 4వ స్థానంలో నిలిచింది. ముగింపు వేడుకల్లో ఫ్లాగ్‌ బేరర్లుగా వ్యవహరించిన మోనా అగర్వాల్ షూటింగ్‌ విభాగంలో, నిషాద్ కుమార్ అథ్లెటిక్స్‌ విభాగాల్లో రెండేసి స్వర్ణ పతకాలతో మెరిసారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఆసియా పారా క్రీడల్లో చైనా ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని చెలాయించింది. 207స్వర్ణ, 117రజత, 111 కాంస్యాలతో సహా మొత్తం 435 పతకాలతో టాప్‌లో నిలువగా.. జపాన్‌(186), ఉబ్జెకిస్తాన్‌(145) పతకాలతో టాప్‌-3లో నిలిచాయి. దక్ష‍ిణ కొరియా(100), ఇరాన్‌(102), థాయ్‌లాండ్(125) పతకాలతో సెంచరీ మార్క్‌ దాటినా భారత్‌కు అత్యధిక స్వర్ణాలతో టాప్‌-4లో నిలిచింది. ఇక 2030 ఆసియా పారా క్రీడలు కతార్‌ వేదికగా జరగనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్