శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆసియా క్రీడలకు 500మందితో భారీ బృందం

8 గంటల క్రితం

hockey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 11:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టోక్యో: జపాన్‌ ‌వేదికగా ఈనెల 15 నుంచి జరిగే 20వ ఆసియా క్రీడలకు భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఎ) భారీ బృందాన్ని పంపుతోంది. భారత్‌ ‌తరఫున మొత్తం 500మందితో భారీ బృందం బయల్దేరి వెళ్లనున్నట్లు ఐఓఎ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 37ఈవెంట్లకు సంబందించి 43 క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు పతకాలకోసం పోటీపడనున్నారు. ఇందులో అథ్లెటిక్స్‌‌కు అత్యధికంగా 73మంది పతకాల రేసులో నిలువగా.. హాకీ, షూటింగ్‌‌లకు కలిసి 40మంది, క్రికెట్‌‌కు 30మంది ఆటగాళ్లు వెళ్తున్నారు. 20వ ఆసియా క్రీడలు జపాన్‌ ‌వేదికగా సెప్టెంబర్‌ 19‌నుంచి అక్టోబర్‌ 4‌వరకు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 17‌న టెక్‌‌బాల్‌ ‌పోటీలతో భారత్‌ ‌పతకాల కోసం పోటీపడనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్