రేపటినుంచి గ్లాస్గో వేదికగా ప్రారంభం
గ్లాస్గో(బ్రిటన్): కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గో వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడా పోటీలకు సంబంధించి సర్వం సిద్ధమైనట్లు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 23నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో 11 క్రీడాంశాల్లో పతకాలకోసం పోటీలు జరగనున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 74 దేశాలకు చెందిన 3వేల మందికి పైగా క్రీడాకారులు 215 పతకాలకోసం పోటీపడనున్నారు. ఒలింపిక్ ఛాంపియన్లు, ప్రపంచ పతక విజేతలు మరియు వర్ధమాన క్రీడాకారులను కామన్వెల్త్ క్రీడల బరిలో దిగుతున్న దృష్ట్యా హోరాహోరీగా సాగడం ఖాయం. తొలిరోజు ప్రారంభోత్సవ వేడుకల తర్వాత బౌల్స్ మరియు పారా బౌల్స్‌తో కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే ట్రాక్ సైక్లింగ్, జూడో మరియు నెట్‌బాల్‌లలో పతకాలు ఖాయం కానున్నాయి. రెండోరోజునుంచి అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, 3x3 బాస్కెట్‌బాల్ మరియు పారా క్రీడలు ప్రారంభమౌతాయి. ఇక భారత్‌నుంచి 125మంది అథ్లెట్లు పతకాలకోసం పోటీపడనున్నారు. మహిళా అథ్లెట్లు లౌవ్లీనా బోర్గోహైన్, మిరాబాయ్ చాను ఫ్లాగ్ బేరర్లుగా ఎంపికయ్యారు. అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 32 మంది (10 మంది మహిళలు, 22 మంది పురుషులు) ప్రాతినిధ్యం వహించగా... ఆ తర్వాత బాక్సింగ్ (14 మంది), జూడో (14 మంది), వెయిట్‌లిఫ్టింగ్ (12 మంది) పోటీ పడుతున్నాన్నారు. అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, జూడో, పారా అథ్లెటిక్స్ విభాగాల్లో భారత్‌కు పతకాలు దక్కే ఛాన్స్ ఉంది.








కామెంట్‌లు (0)