- సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ
మొహాలీ: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు రెండో లీగ్ మ్యాచ్‌లో నిరాశ తప్పలేదు. తొలి లీగ్ మ్యాచ్‌లో త్రిపురపై విజయం సాధించిన ఆంధ్ర.. సోమవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ చేతిలో కేవలం 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎ.ఎస్ బింద్రా పంజాబ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్ ప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. వధేరా(35), మృదుల్(26) బ్యాటింగ్‌లో రాణించగా.. సత్యనారాయణ రాజు(3/27), యశ్వంత్(2/21) బౌలింగ్‌లో రాణించారు. ఛేదనలో ఆంధ్ర బ్యాటర్లు అశ్విన్ హెబ్బర్(34), కెవి శశికాంత్(25) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో ఆంధ్ర జట్టు నిర్ణీ ఓవర్లు ముగిసేసరికి 8వికెట్ల నష్టానికి 150 పరుగులే చేసింది. హిమాచల్ బౌలర్లు ఆయుశ్(3/23), రోహిత్ కుమార్(2/37), మృదుల్(1/21) బౌలింగ్‌లో రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆయుశ్‌కు లభించింది. ఇదే గ్రూప్‌లోని మధ్యప్రదేశ్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి మ్యాచ్‌లో కేరళను ఓడించిన మధ్యప్రదేశ్.. సోమవారం అసోం జట్టుపై ఏకంగా 131 పరుగుల తేడాతో గెలిచింది. కెప్టెన్ రజత్ పాటిదార్ 48 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, పదమూడు సిక్సర్లతో 135 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఛేదనలో అసోం 17.4 ఓవర్లలో కేవలం 119 పరుగులకే ఆలౌటైంది.
హైదరాబాద్ సంచలనం
కోల్‌కతా వేదికగా ఛత్తీస్‌గడ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఒక వికెట్ తేడాతో సంచలన విజయం నమోదు చేసుకుంది. ఎలైట్ గ్రూప్-డిలో తొలి లీగ్ మ్యాచ్‌లో .. ఓడిన హైదరాబాద్.. సోమవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ఛత్తీస్‌గడ్‌ను ఓడించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గడ్ 19.2ఓవర్లలో 168పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లు అజయ్ దేవ్(4/28), చామ మిలింద్(3/20) కట్టడిగా బౌల్ చేశారు. ఛత్తీస్‌గడ్ జట్టులో దేవ్ ఆదిత్య(47), ఆయుశ్(37)లో బ్యాటింగ్‌లో రాణించారు. ఛేదనలో హైదరాబాద్ బ్యాటర్లు హిమతేజ(37), అభిరథ్‌రెడ్డి(34), రాహుల్ బుద్ది(28) రాణించారు. ఈ గెలుపుతో హైదరాబాద్ జట్టు గ్రూప్-డిలో ఆరోస్థానానికి ఎగబాకింది.








కామెంట్‌లు (0)