శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Asian Games 2026 : భారత్‌కు డబుల్ ధమాకా !

9 గంటల క్రితం

Asian Games 2026: Double delight for India!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 04:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

* కబడ్డీలో స్వర్ణం నిలబెట్టుకున్న భారత మహిళ, పురుషుల జట్లు


నగోయా (ఇరాన్‌) : ఆసియా క్రీడల్లో భాగంగా శనివారం నగోయాలో జరిగిన కబడ్డీ ఫైనల్స్‌లో ఇరాన్‌పై ఉత్కంఠభరితమైన విజయాలతో పురుషుల, మహిళల జట్లు రెండూ తమ తమ టైటిళ్లను నిలబెట్టుకోవడంతో, ఆసియా క్రీడల్లో కబడ్డీలో భారత్ డబుల్ గోల్డెన్ సాధించింది. భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. కబడ్డీ, స్క్వాష్, ఆర్చరీ, మారథాన్ విభాగాల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు.


పురుషుల కబడ్డీలో స్వర్ణ పతకం :

ఆసియన్ గేమ్స్ పురుషుల కబడ్డీ అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో భారత్ అద్భుత పునరాగమనం చేసింది. ఇరాన్ జట్టుతో జరిగిన రసవత్తర పోరులో భారత్ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. తొలి నుంచి తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, ఆఖరి క్షణాల్లో భారత ఆటగాళ్లు ఒత్తిడిని జయించి ఇరాన్‌ను ఓడించారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో భారత పురుషుల జట్టు ఇరాన్‌ను 40-34 తేడాతో ఓడించి తమ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. ఒక దశలో స్కోర్లు 20-20తో సమం కాగా, ఆ తర్వాత భారత్ పైచేయి సాధించి మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.


మహిళల కబడ్డీలోనూ పసిడి వెలుగులు :

మరోవైపు మహిళల కబడ్డీ ఫైనల్లోనూ భారత్ సత్తా చాటింది. ఇరాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 37-34 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.


స్క్వాష్, మారథాన్‌లో చారిత్రక ప్రదర్శన :

* అనాహత్ సింగ్ అద్భుతం: 18 ఏళ్ల స్క్వాష్ సంచలనం అనాహత్ సింగ్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన సతోమి వతనాబేపై 3-2 తేడాతో సంచలన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.

* ఫైనల్లో అభయ్ సింగ్: పురుషుల సింగిల్స్ స్క్వాష్ సెమీఫైనల్లో అభయ్ సింగ్ 3-0 తేడాతో పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్‌పై తిరుగులేని విజయం సాధించి ఫైనల్ చేరుకున్నాడు.

* మారథాన్‌లో రికార్డు రజతం: పురుషుల మారథాన్‌లో సావన్ బార్వాల్ చారిత్రక ప్రదర్శన చేశాడు. నయా జాతీయ రికార్డును నమోదు చేస్తూ భారత్‌కు రజత పతకాన్ని అందించాడు.

* మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం: మిక్స్‌డ్ డబుల్స్ స్క్వాష్ సెమీఫైనల్లో జోష్నా చిన్నప్ప - వేలవన్ సెంథిల్ కుమార్ జంట హాంకాంగ్‌కు చెందిన టాంగ్ మింగ్ హాంగ్ - లీ కా యీ జంట చేతిలో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.


ఆర్చరీలో ధీరజ్ బొమ్మదేవరపై భారీ ఆశలు :

ఆర్చరీ విభాగంలో భారత స్టార్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరపై పతక ఆశలు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల సాల్టిల్లోలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో పసిడి గెలిచి, ఈ టైటిల్ సాధించిన తొలి భారతీయ పురుష రికర్వ్ ఆర్చర్‌గా ధీరజ్ చరిత్ర సృష్టించాడు. ఆసియన్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్ 2025 టైటిల్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న 25 ఏళ్ల ధీరజ్, ఆసియన్ గేమ్స్‌లోనూ భారత్‌కు పతకం అందించేందుకు సిద్ధమయ్యాడు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్