ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బైబై నగోయా..వెల్‌‌కమ్‌ ‌దోహా!

2 గంటల క్రితం

social
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 10:32 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- ముగిసిన 2026 ఆసియా క్రీడలు

- ముగింపు వేడుకల్లో మెరిసిన భారత బృందం

నగోయా : 14 రోజులు, 46 దేశాలు, 43 క్రీడా పోటీలు, 469 పసిడి పతకాలు, 10 వేల మంది క్రీడాకారులు.. రెండు వారాల అతిపెద్ద క్రీడా సంబరానికి తెరపడింది. ఆదివారం నగోయా సిటీలోని పాలోమా మిజుహో స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా ట్రాప్‌ ‌షూటర్‌ ‌నీరూ దండా నిలిచింది. సాధారణంగా పోటీల ఆరంభం, ముగింపు వేడుకలకు పతాకధారులుగా ఇద్దరు ఉంటారు. ఒకరు పురుష అథ్లెట్‌, మరొకరు మహిళా అథ్లెట్‌. ఆదివారం ముగింపు వేడుకల్లో భారత్ నుంచి ఒక్కరే హాజరుకావడం గమనార్హం. వేదికపైకి భారత అథ్లెట్లు జాతీయ జెండాలతో చేరుకున్నారు. ‘హార్ట్‌ ‌బీట్‌ ఏచి నగోయా’ థీమ్‌‌తో సాగిన ముగింపు వేడుకలు ఆసియా క్రీడలకు బైబై పలికాయి. ఆసియా ఒలింపిక్‌ ‌కౌన్సిల్‌ అధ్యక్షుడు షేక్‌ ‌జోహాన్‌ ‌బిన్‌ ‌హమద్‌ అల్‌ ‌థాని 2026 ఆసియా క్రీడలు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించారు. 2023లో 21వ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న దోహా (ఖతార్‌)‌కు ఆసియా క్రీడల టార్చ్‌, ఆసియా ఒలింపిక్‌ ‌కౌన్సిల్‌ ‌ఫ్లాగ్‌‌ను అధికారికంగా అందజేశారు.

​‘సెంచరీ’ మిస్‌... నాలుగో స్థానంలో భారత్‌

ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ 21 స్వర్ణాలతో సహా మొత్తం 85 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో చైనా (341) ఉండగా.. జపాన్ (269), దక్షిణ కొరియా (150) తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది భారత్‌ ‌ప్రదర్శన నిరుత్సాహం కలిగించకపోయినా, మరీ అద్భుతం అనిపించలేదు. గత ఆసియా క్రీడల్లో సాధించిన 106 పతకాలను భారత్‌ ‌బృందం పునరావృతం చేయలేకపోయింది. ముఖ్యంగా అథ్లెటిక్స్‌, షూటర్లు, బ్యాడ్మింటన్ క్రీడాకారుల నుండి ఇంకా మెరుగైన ప్రదర్శనను అభిమానులు ఆశించారు. అయినా 85 పతకాలతో మంచి ప్రదర్శన కనబరిచింది. చివరికి, భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. భారత్‌ ‌సాధించిన 21 బంగారు పతకాల్లో 11 పతకాలు చివరి రెండు రోజుల్లోనే లభించడం విశేషం. స్టార్లతో నిండిన క్రికెట్ జట్టుతో పాటు హాకీ జట్లు స్వర్ణాలు సాధించాయి. మహిళ హాకీ జట్టు అయితే ఏకంగా 44 ఏళ్ల తరువాత స్వర్ణం సాధించి ఒలింపిక్స్‌ ‌బెర్త్‌‌ను ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ జట్టు కూడా మహిళల బృందాన్నే అనుసరించింది. 17 ఏళ్ల ఆర్చర్ కుంకుమ్ మొహోద్, గోల్ఫర్ ప్రణవి ఉర్స్ అనూహ్య చరిత్ర సృష్టించారు. శనివారం నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ గౌరవప్రదమైన నాలుగో స్థానంలో నిలవడానికి దోహదపడిన చివరి స్వర్ణ పతకాల వేటలో వీరు కూడా భాగస్వాములయ్యారు. స్టార్లతో నిండిన క్రికెట్, హాకీ జట్లు ఊహించిన విధంగానే తమ టైటిళ్లను నిలబెట్టుకున్నాయి. 17 ఏళ్ల ఆర్చర్ కుంకుమ్ మొహోద్, గోల్ఫర్ ప్రణవి ఉర్స్ అనూహ్య చరిత్ర సృష్టించారు. పదిహేడేళ్ల కుంకుమ్ మొహోద్ వ్యక్తిగత, మిశ్రమ జట్టు రికర్వ్ విభాగాలలో స్వర్ణ పతకాలు గెలుచుకుని సత్తా చాటారు. ఆసియా క్రీడలలో రికర్వ్ విలువిద్యలో వ్యక్తిగత స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా కుంకుమ్ కొత్త రికార్డు నెలకొల్పింది. ఆర్చరీలో 9 పతకాలు రాగా, ఇందులో ఐదు స్వర్ణాలు ఉన్నాయి. ఎక్కువ స్వర్ణాలు గెలిచిన వాటిలో ఆర్చరీ బృందం ముందుంది. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌, హాకీ సెమీ ఫైనల్‌కు రికార్డుస్థాయి వ్యూస్‌ లభించాయని ఒసిఎ కో ఆర్డినేషన్‌ కమిటీ అధ్యక్ష‍ుడు తయ్యబ్‌ ఇక్రమ్‌ తెలిపారు.

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 13 ఏళ్ల చైనా స్విమ్మర్‌

13 ఏళ్ల చైనా స్విమ్మర్‌ ‌ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. యు జిడి ఏకంగా మూడు పసిడి పతకాలు కొల్లగొట్టింది. ఆసియా క్రీడల ఈత కొలనులో పసిడి మోతతో 2028 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ ఈత కొలనులో అలజడికి తెరలేపింది. ఆసియా క్రీడల్లో మోస్ట్‌ ‌వాల్యూవబుల్‌ ‌ప్లేయర్‌‌గా నిలిచిన యు జిడి.. ప్రపంచ స్విమ్మింగ్‌‌లో సరికొత్త సంచలనంగా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

విజయవంతమే, కానీ! :

కరోనా మహమ్మారి కఠిన సమయంలో టోక్యో ఒలింపిక్స్‌‌ను గొప్పగా నిర్వహించిన ఘనత జపాన్‌ ‌సొంతం. కానీ, 2026 ఆసియా క్రీడల ఆతిథ్యం జపాన్‌ ‌ట్రాక్‌ ‌రికార్డును దెబ్బతీసిందనే చెప్పాలి. ఖర్చు తగ్గించుకునేందుకు ‌గేమ్స్‌ విలేజ్‌‌ను నిర్మించకుండా.. 15 వేల మంది క్రీడాకారులు, అధికారులకు హోటల్స్‌, చెక్కతో చేసిన కంటెయినర్లు, క్రూయిజ్‌ ‌నౌకల్లో వసతి ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. సమన్వయంతో పని చేయలేకపోయారు. భారత్‌‌తో సహా అధిక శాతం దేశాల క్రీడాకారులు సరైన సమయంలో రూమ్స్‌ ‌కేటాయింపు కోసం ఇబ్బందులు పడ్డారు. లాజిస్టికల్‌ ‌సమస్యలు సైతం ఎక్కువగానే కనిపించాయి. సమాచార లోపంతో ఓ స్టేడియంకు వెళ్లాల్సిన క్రీడాకారుల బస్సు మరో స్టేడియానికి వెళ్లాయి. దీంతో పలు ఆటల పోటీల షెడ్యూల్‌ ‌మార్చాల్సి వచ్చింది. మెడల్‌ ‌పోడియంపై దక్షిణ కొరియా జాతీయ గీతం బదులుగా ఉత్తర కొరియా జాతీయ గీతం వినిపించటం అందరినీ ఇరకాటంలోకి నెట్టింది. ఫుట్‌‌బాల్‌‌లో దక్షిణకొరియాపై జపాన్‌ గెలుపొందగా.. పతకాల ప్రదాన వేడుకలో ఆ దేశ జాతీయ గీతం వినిపించలేదు. ఆసియా క్రీడలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అక్కడి ప్రజలు ఆసక్తి చూపించలేదు. అత్యధిక శాతం స్టేడియాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. జపాన్‌, దక్షిణ కొరియా ఫుట్‌‌బాల్‌ ‌మ్యాచ్‌ ‌ఫైనల్‌‌కు వెయ్యి మంది అభిమానులు సైతం స్టేడియానికి రాలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్