శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

CommonWealth Games :భారత్‌కు ఒక్క రోజే 25 పతకాలు..?

14 గంటల క్రితం

games
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 12:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

కామన్వెల్త్‌ గేమ్స్‌-2026లో భారత్‌ ఇప్పటివరకు 23 పతకాలు సాధించింది. ఇందులో 5 బంగారు, 12 రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌ పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. అయితే భారత్‌ ఖాతాలో ఇంకా గణనీయంగా పతకాలు చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 10 మంది భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరుకుని స్వర్ణ పతకాల కోసం పోటీకి సిద్ధమయ్యారు. వీటితో పాటు ఇతర విభాగాల్లోనూ మరో 15 పతకాలు వచ్చే అవకాశముంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భారత్‌ పతకాల సంఖ్యను గణనీయంగా పెంచుకోవడంతో పాటు మెడల్స్‌ టాలీలో టాప్-5లోకి చేరే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయి.

బాక్సింగ్‌ (10 మెడల్స్‌-ఫైనల్స్‌)

  • మహిళల 54 కేజీల విభాగం: ప్రీతి

  • మహిళల 57 కేజీల విభాగం: జాస్మైన్

  • పురుషుల 55 కేజీల విభాగం: జాదుమణి

  • మహిళల 51 కేజీల విభాగం: సాక్షి

  • మహిళల 60 కేజీల విభాగం: ప్రియా

  • మహిళల 70 కేజీల విభాగం: లొవ్లీనా

  • పురుషుల 60 కేజీల విభాగం: సచిన్

  • పురుషుల 80 కేజీల విభాగం: అంకుష్ పంఘాల్

  • పురుషుల 90 కేజీల+ విభాగం: నరేందర్

జూడో (4 మెడల్స్‌)..

  • మహిళల 63 కేజీల విభాగం రౌండ్16: ఉన్నతి శర్మ

  • పురుషుల 90 కేజీల విభాగం రౌండ్‌16: కరంజిత్‌ సింగ్ మాన్

  • పురుషుల 81 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్: హర్ష్‌ టోకస్

  • మహిళల 70 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్‌: ఇనుంగన్బి తఖెల్లాంబమ్‌

అథ్లెటిక్స్‌ (8 మెడల్స్)

  • పురుషుల ట్రిపుల్ జంప్‌ ఫైనల్‌ (2 మెడల్స్‌): ప్రవీణ్‌ చిత్రావెల్, సెల్వ ప్రభు తిరుమరన్

  • మహిళల 10వేల మీటర్ల రేస్‌ వాక్‌ ఫైనల్ (2): ప్రియాంకా గోస్వామి, రవీనా గైక్వాడ్

  • పురుషుల పోల్‌ వాల్ట్ ఫైనల్‌ (2): దేవ్‌ కుమార్‌ మీనా, కుల్‌దీప్‌ కుమార్

  • పురుషుల 5వేల మీటర్లు వాక్‌ ఫైనల్ (1):  గుల్వీర్‌ సింగ్‌

  • మిక్స్‌డ్‌ 4X400 మీ. రిలే ఫైనల్ (1)

పారా అథ్లెటిక్స్‌ (3 మెడల్స్‌)

  • పురుషుల షాట్‌పుట్ ఎఫ్‌57 ఫైనల్ (2): సోమన్‌ రానా, శుభ్‌మ్ జుయల్

  • పురుషుల 1500 మీ. టీ54 ఫైనల్ (1): రమేశ్‌ షణ్ముగం 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్