మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionHockey World Cup: భారత హాకీజట్టుకు నిరాశ

19 గంటల క్రితం

india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 10:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇంగ్లండ్‌ ‌చేతిలో ఓటమి

  • ఎఫ్‌ఐహెచ్‌ ‌హాకీ ప్రపంచకప్‌

బ్రస్సెల్స్‌(బెల్జియం): ఎఫ్‌ఐహెచ్‌ ‌హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు అనూహ్యంగా ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌‌తో సోమవారం జరిగిన కీలక పోరులో భారతజట్టు తొలి అర్ధభాగం ముగిసేసరికి 2-1తో ఆధిక్యతలో నిలిచింది. కానీ రెండో అర్దభాగం ప్రత్యర్ధి జట్టుకు మూడు గోల్స్‌ ‌సమర్పించుకొని చేజేతులా ఓటమిపాలైంది. వాఘెనార్‌ ‌హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌‌లో ప్రారంభం నుంచి ఇంగ్లండ్‌‌పై హర్మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సేన ఆధిపత్యం చెలాయించింది. కానీ తొలి క్వార్టర్‌ ‌చివర్లో 14వ నిమిషంలో ఇంగ్లండ్‌ ఆటగాడు నికోలాస్‌ ‌గోల్‌ ‌చేయడంతో భారత్‌ 0-1తో వెనుకబడింది. కానీ రెండో క్వార్టర్‌ ‌ప్రారంభం నుంచే దూకుడా ఆడి 17వ ని.లో కెప్టెన్‌ ‌హర్మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌గోల్‌ ‌చేయడంలో స్కోర్‌ 1-1‌తో సమమైంది. 25వ ని.లో దిల్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌ఫీల్డ్‌ ‌గోల్‌ ‌చేయడంతో భారత్‌ 2-1 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. కానీ మూడో క్వార్టర్‌ ‌రష్మిరే స్టువార్ట్‌(39‌వ ని.లో), క్రాఫ్ట్‌ ‌హెన్రీ 43వ ని.లో గోల్స్‌ చేయడంలో భారత హాకీజట్టు 2-3గోల్స్‌‌తో వెనుకబడింది. ఇక చివరి క్వార్టర్‌‌లో భారతజట్టు పోరాడినా ప్రయోజనం లేకపోయింది. కానీ ఇంగ్లండ్‌ ‌బండారు నికోలాస్‌ (54‌వ ని.) మరో గోల్‌ ‌చేయడంతో ఓటమిపాలైంది. దీంతో పూల్‌-డిలో భారతజట్టు రెండో లీగ్‌ ‌మ్యాచ్‌‌లు ముగిసేసరికి ఒక గెలుపు, ఒక ఓటమితో 2వ స్థానంలో కొనసాగుతోంది. శనివారం జరిగే చివరి పూల్‌ ‌లీగ్‌ ‌మ్యాచ్‌‌లో భారతజట్టు పాకిస్తాన్‌‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌‌లో గెలిస్తే భారత్‌ 2వ స్థానంతో ముగించనుంది. అంతకుముందు పురుషుల విభాగం గ్రూప్‌-‌డిలో పాకిస్తాన్‌-‌వేల్స్‌ ‌మ్యాచ్‌ ‌డ్రా అయ్యింది. ఇరుజట్లు 4క్వార్టర్లు ముగిసేసరికి 3-3గోల్స్‌‌తో సమంగా నిలిచాయి. పాకిస్తాన్‌, వేల్స్‌ ‌మ్యాచ్‌ ‌డ్రా కావడంతో భారత హాకీ జట్టు టాప్‌-2 బెర్త్‌‌లో నిలవడం ఖాయం. ఇక మహిళల పూల్‌-‌బిలో అమెరికా జట్టు 3-2తో స్కాట్లాండ్‌‌ను, పూల్‌-ఎలో జపాన్‌ ‌మహిళల జట్టు 3-0తో చిలీని ఓడించాయి. నేడు జరిగే మహిళల పూల్‌-డిలో భారత జట్టు దక్ష‍ిణాఫ్రికా మహిళలతో తలపడనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్